హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ కుర్ర ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఫిక్స్ అయినట్లేనా?

అధికార వైసీపీలో యువనేతలకు కొదవ లేదనే చెప్పొచ్చు. జగన్ అండతో పలువురు యువనేతలు పార్టీలో కీలకంగా ఎదిగారు. అలాగే 2019 ఎన్నికల్లో చాలామంది యువనేతలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించి దూసుకెళుతున్నారు. ప్రతిపక్ష టీడీపీకి చుక్కలు చూపిస్తూ, తమ అధినేత జగన్‌కు అండగా ఉంటున్నారు. అలా వైసీపీలో దూకుడుగా ఉన్న యువ ఎమ్మెల్యేల్లో గుడివాడ అమర్నాథ్ ముందు వరుసలో ఉంటారు.

2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన అమర్నాథ్, 2019 ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి దూకుడుగా పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో సమస్యలని పరిష్కరిస్తున్నారు. కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉంటున్నారు. ప్రతిపక్ష టీడీపీ చేసే విమర్శలకు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు.

ఇక విశాఖపట్నం నుంచి అవంతి శ్రీనివాస్ ఒక్కరే మంత్రివర్గంలో ఉన్నారు. దీంతో నెక్స్ట్ జరగబోయే మంత్రివర్గ విస్తరణలో అమర్నాథ్‌కు పదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్‌కు సన్నిహితంగా మెలిగే అమర్నాథ్ లాంటి వారికి పదవి ఇస్తే పార్టీకే అడ్వాంటేజ్ వచ్చే అవకాశముందని తెలుస్తోంది. అనకాపల్లిలో దాడి వీరభద్రరావు ఫ్యామిలీ కూడా ఉంది. కానీ వారికి రాజకీయంగా ఫాలోయింగ్ తగ్గిపోయింది. దీంతో అమర్నాథ్‌కు నియోజకవర్గంలో తిరుగులేకుండా పోయింది. అటు టీడీపీలో పీలా గోవింద్ తన పని తాను చేసుకుపోతున్నారు.

అయితే అనకాపల్లిలో కూడా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా చేపట్టిన అనకాపల్లి–ఆనందపురం ఆరు లైన్ల రహదారి వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తి కానుంది. అయితే అనకాపల్లిని పురపాలక సంఘంగా అప్ గ్రేడ్ చేసి పన్నులు పెంచేశారు. ఇక డంపింగ్ యార్డు పట్టణం మధ్యలోనే ఉంది. దీనివల్ల ప్రజలు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో తాగునీటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని ఆధునీకరించాలి. చెరుకు, బెల్లం రైతులను ఆదుకోవాల్సి ఉంది. అటు బొజ్జన్నకొండను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: