హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యే టీడీపీకి అడ్వాంటేజ్ అవుతున్నారా?
ఇక తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రామిరెడ్డికి మంచి మార్కులు పడుతున్నాయా? అంటే చెప్పడం కష్టమే అని తెలుస్తోంది. ఆయనకు ఇంకా జగన్ ఇమేజ్‌తోనే బండి నడిపిస్తున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎమ్మెల్యేకు బాగా ప్లస్ అవుతున్నాయి. అయితే ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటూ వీలైన వరకు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో రామిరెడ్డి మంచిపనితీరు కనబర్చారు. ప్రజలు మంచి సపోర్ట్‌గా ఉన్నారు.
కాకపోతే ఎమ్మెల్యే కాస్త సొంత వాళ్ళకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇంకా నియోజకవర్గంలో పలు సమస్యలు కూడా ఉన్నాయి. ఇక్కడ తాగునీటి సమస్యలు ఎక్కువ. రాబోయేది వేసవికాలం కాబట్టి దానికి అనుగుణంగా తాగునీటి సమస్యలని పరిష్కరిస్తే బాగుంటుంది. అలాగే నియోజకవర్గంలో రోడ్ల పరిస్తితి కూడా దారుణంగానే ఉంది. నక్కలదొడ్డి, పామిడి సమీపంలో సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకు నిర్మించాలని ఎమ్మెల్యే గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇక విశాఖ రైల్వే డివిజన్ వస్తే, గుంతకల్ దశ తిరుగుతుంది.
ఇక రాజకీయ పరంగా చూసుకుంటే ఎమ్మెల్యే మీద నెగిటివ్ ఏమి లేదు. అలా అని పాజిటివ్ కూడా పెద్దగా లేదనే చెప్పొచ్చు. అయితే ఇంకా ఎమ్మెల్యే దూకుడుగా పనిచేస్తే టీడీపీకి స్కోప్ లేకుండా పోతుంది. అలా కాకపోతే ఎమ్మెల్యేని టీడీపీకి అడ్వాంటేజ్ అవుతారు. ఇప్పటికే టీడీపీ నేత జితేందర్ గౌడ్ దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు. కాబట్టి ఎమ్మెల్యే ప్రజలకు నిత్యం అండగా నిలబడితే తిరుగుండదు.