హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ సీనియర్ ఎమ్మెల్యేకు అశోక్ కుమార్తె పోటీ ఇస్తున్నారా?
సీనియర్ ఎమ్మెల్యే అయినా కోలగట్ల...నియోజకవర్గంలో బాగానే పనిచేస్తున్నారు. జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ పెత్తనం నడుస్తుంటే, ఇక్కడ మాత్రం కోలగట్లదే హవా. ప్రభుత్వ పథకాలు, ఇళ్ల పట్టాలు ఎమ్మెల్యేకు ప్లస్. అలాగే ఎప్పుడు ప్రజల్లో ఉండటం కలిసొచ్చే అంశం. అయితే నియోజకవర్గంలో పలు సమస్యలు కూడా ఉన్నాయి.
విజయనగరం దరిదాపుల్లో ఎన్ని నదులు ప్రవహిస్తున్నా జిల్లా కేంద్రంమైన విజయనగర పట్టణంలో మాత్రం తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. తాగు నీటి సమస్య తరువాత ఈ పట్టణంలో అతి పెద్ద సమస్య ఇరుకైన రహదారులు, డ్రైనేజ్ సమస్య. ఎన్నో ఏళ్ళు అశోక్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినా, నగరంలో సమస్యలు తగ్గలేదు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్న సమస్యలు అలాగే ఉన్నాయి.
ఇక రాజకీయంగా చూసుకుంటే కోలగట్ల బలంగానే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమార్తెకు సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. ఇటు టీడీపీ వైపు ఉన్న అతిథి కూడా నియోజకవర్గంలో బాగానే కష్టపడుతున్నారు. తండ్రి అశోక్ అండతో విజయనగరంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అయితే జగన్ హవా ఉంటే అశోక్ కుమార్తె గెలుపు కష్టమే.