హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: తునిలో యనమల ఫ్యామిలీని తోక్కేసిన రాజా
తూర్పు గోదావరి తుని నియోజకవర్గం...1983 నుంచి 2004 వరకు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అడ్డా. అంటే 1983, 1985, 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో యనమల వరుసగా గెలిచి డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. ఇక 2009 ఎన్నికల్లో యనమలకు తొలిసారి చెక్ పడింది. కాంగ్రెస్ అభ్యర్ధి వెంకట కృష్ణంరాజు చేతిలో యనమల ఓటమి పాలయ్యారు.
ఇక 2014 నుంచి యనమల ప్రత్యక్ష ఎన్నికలకు దూరమయ్యారు. దీంతో తునిలో యనమల సోదరుడు కృష్ణుడు టీడీపీ తరుపున బరిలో దిగారు. కానీ కృష్ణుడు వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. అయితే టీడీపీ అధికారంలోకి రావడం యనమల రామకృష్ణుడు మంత్రిగా పనిచేయడంతో, నియోజకవర్గంలో కృష్ణుడు పెత్తనం చేసారు. అసలు నియోజకవర్గంలో యనమల ఫ్యామిలీ చేసిన అరాచకాల దెబ్బకు విసుగెత్తిపోయిన ప్రజలు, మరోసారి 2019 లో దాడిశెట్టి రాజాని గెలిపించారు.
పైగా వైసీపీ అధికారంలోకి రావడంతో, రాజా నియోజకవర్గంలో మంచిగా పనిచేసుకుంటున్నారు. ఎలాంటి పనికైనా డబ్బులు ఖర్చు పెట్టడంలో వెనుకాడటం లేదు. అటు ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికీ అందేలా చేస్తున్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు అందించారు. ఇక పంచాయితీ ఎన్నికల్లో వైసీపీకి మెజారిటీ సర్పంచ్‌లు దక్కేలా చేశారు. ముఖ్యంగా తుని మున్సిపాలిటీలో వైసీపీ జెండా ఎగిరేలా చేశారు. ఇక్కడ వైసీపీకి మెజారిటీ వార్డులు దక్కాయి. యనమల రామకృష్ణుడు ఇక్కడ టీడీపీని గెలిపించలేకపోయారు.
ఇక త్వరలో జరగబోయే ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ వన్ సైడ్ విజయం సాధించడం ఖాయం. నియోజకవర్గంలో ఉన్న తుని, కోటనందూరు, తొండంగి మండలాల్లో వైసీపీ హవా బాగా ఉంది. అయితే తునిలో యనమల ఫ్యామిలీ ఉన్నంత కాలం దాడిశెట్టికి తిరుగులేనట్లే అని తెలుస్తోంది. దశాబ్దాల పాటు యనమల ఫ్యామిలీతో విసుగెత్తిపోయిన తుని ప్రజలు, ఫుల్ సపోర్ట్ దాడిశెట్టికి ఇస్తున్నారు.
ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ టికెట్ యనమల ఫ్యామిలీకి కాకుండా వేరే లీడర్‌కి టికెట్ ఇస్తే కొంచెం బెటర్ గా ఉంటుందని, లేదంటే తునిలో టీడీపీ సమాధి కావడం గ్యారెంటీ అంటున్నారు. అయితే చంద్రబాబు, యనమల ఫ్యామిలీని కాదని వేరే వాళ్లకు టికెట్ ఇవ్వడం కష్టం. కాబట్టి తునిలో యనమల ఫ్యామిలీ ఉన్నంత వరకు విజయం దాడిశెట్టి రాజాదే.