ఆ హీరోయిన్ నోరు విప్పితే శింబుకి ఇబ్బందే?

E. Rama Krishna

కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోయిన్స్ కి సంబంధించిన భద్రతపై హాట్ హాట్ టాక్స్ నడుస్తున్నాయి. గతంలో హీరోయిన్స్ పై కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన హీరోలు పెత్తనం చెలాయించే వారు. హీరోయిన్స్ ని ఏ మాత్రం ఇండస్ట్రీలో ఎదగనిచ్చే వారు కాదు. సౌత్‌ ఫిల్మ్ ఇండస్ట్రీలోని అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలలో ఒక్క కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హీరోయిన్స్ పై ఇతరుల పెత్తనం ఎక్కవుగా ఉంటుందని హీరోయిన్స్ ఇప్పుడు చెబుతూ తెగ బాధపడిపోతున్నారు.


తాజాగా భావన కిడ్నాప్‌ సంఘటన పలు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు పుట్టిస్తుంది. ఈ నేపథ్యంలో నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ తనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగిన కొన్ని చేదు సంఘటనలను పబ్లిక్ గా చెబుతున్నారు. ఈ బ్యూటీ ఇప్పటికే విశాల్, శింబులను టార్గెట్ చేసుకుంటూ సంచలన కామెంట్స్ చేసింది. విశాల్‌, శింబులు తనపై దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. చిత్రపరిశ్రమలో ఉన్నాం కాబట్టి…ఆఫర్స్ కోసం కొన్ని భరించాల్సిన అవసరం వచ్చిందని అంటున్నారు. ఇదిలా ఉంటే నటి నయనతార తాజాగా శింబు పై కామెంట్స్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. గత కొంత కాలంగా శింబు.. నయనతార కి దగ్గరవ్వాలని చూస్తున్నారు. కానీ నయనతార మాత్రం శింబుకి దూరంగా ఉంటుంది.


వీరిద్దరి కాంబినేషన్ లో పలు చిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా వీరిద్దరూ చేసిన వల్లభ సినిమాలోని హాట్ సాంగ్ ఇప్పటికీ హాట్ హాట్ గానే ఉంటుంది. అయితే వీరిద్దరూ కలిసి సినిమాలు చేసేటప్పుడు శింబు వద్ద నుండి నయనతార కొన్ని అభ్యంతరకర మాటలను వినాల్సి వచ్చిందని సన్నిహితులతో చెప్పుకొచ్చిందట. ఈ న్యూస్ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది. అయితే నయనతార కనుక నోరు విప్పిందంటే శింబు పై జరిగే నష్టం ఎక్కువుగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్స్ తో ఇప్పుడు కోలీవుడ్ హీరోలు చాలా దూరంగా ఉంటున్నారని టినగర్ టాక్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: