విరుష్కకు ‘బీబోయ్’ కండోమ్‌ వాడాలన్న హాట్ బ్యూటీ..!

Edari Rama Krishna
బాలీవుడ్ లో ఎప్పడూ వివాదాలకు  కేరాఫ్ అడ్రస్‌ గా ఉండే హాట్ బ్యూటీ  రాఖీ సావంత్ నూతన జంట కోహ్లీ-అనుష్కలకు వివాదాస్పద సలహా ఇచ్చింది.  ప్రస్తుతం ఈ అమ్మడు ‘బీబోయ్’ అనే కండోమ్ బ్రాండ్‌కు రాఖీ సావంత్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఆమె నటించిన ఈ కండోమ్ ప్రకటనలపై ఇటీవల వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.  వీటిని ఉదయం ప్రసారం చేయవద్దని, రాత్రి పది తర్వాతే ప్రసారం చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కండోమ్ ప్రకటనలు అసభ్యంగా ఉంటుండడంతో వీటి ప్రకటనలు నిలిపివేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో కోర్టు కండోమ్ ప్రకటనల ప్రసారంపై ఆంక్షలు విధించింది.  తాజాగా ‘బీబోయ్’ కండోమ్ గురించి వ్యాఖ్యానించి రాఖీ సావంత్ మరోసారి వార్తల్లో నిలిచింది.  కొద్దిరోజుల క్రితం విరుష్క జంట ఒక్కటయ్యారు. ప్రస్తుతం రిసెప్షన్‌‌లో బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. 

 కొత్తగా బీబోయ్ కండోమ్స్ ప్రకటన చేస్తున్నారు కదా వీటి తొలి వినియోగదారులు ఎవరైతే బాగుంటుందని మీడియా ప్రతినిధులు రాఖీని ప్రశ్నించారు. ఇందుకు ఆమె స్పందిస్తూ..  తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ‘బీబోయ్’ కండోములకు క్రికెటర్ కోహ్లీ-అనుష్క జంట తొలి వినియోగదారులు అయితే బాగుంటుందన్న రాఖీ.. అవి వాడి ఎలా ఉన్నాయో చెప్పాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 

దీంతో రాఖీపై విరుష్క అభిమానులు పీకల్లోతు కోపంతో ఊగిపోతున్నారు. రాఖీ సావంత్ అసలేం మాట్లాడుతున్నావో మీకే అర్థం కావట్లేదా అన్నట్లుగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎంత వరకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: