‘జల్సా’లు చూపిస్తూ..వేష భాషలు మారుస్తూ..పూనం షాకింగ్ ట్విట్!

Edari Rama Krishna
ఈ మద్య సోషల్ మీడియాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ని టార్గట్ చేసుకొని పొలిటికల్ లీడర్స్ మాత్రమే కాదు..సినీ ఇండస్ట్రీ వారు సైతం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.  ఆ మద్య కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్న నటి శ్రీరెడ్డి పవన్ కళ్యాన్ టార్గెట్ చేసుకొని చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఏకంగా పవన్ ఆయన తల్లిని పట్టుకొని అనరాని మాటలు అని పెను వివాదాలు సృష్టించింది.  తాజాగా శ్రీరెడ్డి బాటలోనే నడుస్తుంది..నటి పూనమ్ కౌర్. 

కొంత కాలంగా పవన్ కళ్యాన్ ని ఇన్ డైరెక్ట్ గా ఎటాక్ చేస్తున్న ఈ అమ్మడు తాజాగా మరోసారి తన మాటల తూటాలు పేల్చింది. ఇటీవల ‘కాన్సెప్ట్స్ కాపీ చేసి, డైలాగ్స్ కాపీ చేసి, బట్టలు మార్చుకుంటూ, మనుషులను మారుస్తూ, మాట మీద ఉండకపోవడం, జనాలు ఇన్నోసెన్స్‌తో ఆడుకుంటూ.. వేష భాషలు మారుస్తూ జనాల్ని మభ్యపెట్టి అమ్మాయిలని అడ్డంపెట్టుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు కొంతమంది.

ఆ భగవంతుడే నిజం ఏంటో అని తెలిపించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు పూనమ్.  కాకపోతే తన ట్విట్ లో పవన్ కళ్యాన్ ప్రస్తావన ఎక్కడా తీసుకు రాకుండా ప్రతి మాట పవన్‌ని ఉద్దేశించే అంటూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ నడిచింది. అయితే వీటికి మరింత బలాన్ని చేకూర్చుతూ.. ట్విట్టర్‌లో మరో సంచలన పోస్ట్ పెట్టింది పూనమ్ కౌర్. జల్సా’లు చూపిస్తూ ‘అజ్ఞాతవాసం’లో వేసేస్తాడు జాగ్రత్త అతడో నమ్మక ద్రోహి అంటూ ట్వీట్ చేసింది పూనమ్. అయితే జల్సా, అజ్ఞాతవాసి రెండు చిత్రాలు పవన్‌వే కావడంతే ఈ ఇన్ డైరెక్ట్ ఎటాక్ పవన్‌ని ఉద్దేశించే అంటూ సోషల్ మీడియాలో చర్చమొదలైంది. 


ఆ మద్య ఫిలిమ్ క్రిటిక్ కత్తి మహేష్ వర్సెస్ పవన్ కళ్యాన్ మద్య వివాదం చెలరేగుతున్న సమయంలో పూనమ్ కౌర్ కూడా ఎంటర్ కావడం..పెను సంచలనాలకు దారి తీసింది. ప్రస్తుతం పవన్ జనసేన యత్ర చేస్తున్నారు..ఈ నేపథ్యంలో ఆయనకు  కాస్త మైలేజ్ తెచ్చేవిధంగా ఉన్న సందర్భంలో ఈ మైలేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు పూనమ్‌ను రంగంలోకి దింపారనేది రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇన్నాళ్లు గప్‌చిప్‌గా ఉండి పవన్ జనంలో బాగా ఫోకస్ అవుతున్న సందర్భంలో మాత్రమే పూనమ్ సోషల్ మీడియాలో ఇన్ డైరెక్ట్ ఎటాక్‌కి దిగుతుందని పవన్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

Jalsalu choopistu agnyathavaasam lo esestadu ...Jaggeratha #namakadrohi

— Poonam Kaur Lal (@poonamkaurlal) May 24, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: