దేవదాస్ : రివ్యూ
దాసు (నాని) ఓ అమాయకమైన వ్యక్తి. డాక్టర్ అయిన దాసు తనకు తానుగా ఎవరికి హాని కలిగించని వ్యక్తిత్వం కలవాడు. ఇక మరో పక్క అతని జీవితంలోకి అనుకోకుండా డాన్ అయిన దేవా (నాగార్జున) వస్తాడు. గాయాలతో వచ్చిన దేవాని డాక్టర్ గా కాపాడగా దేవ.. దాస్ ఇద్దరు తెలియకుండానే ఒకరంటే ఒకరు స్నేహితులవుతారు. ఈ క్రమంలో డాన్ అయిన దేవా తను చేసిన పనుల వల్ల పోలీసులు అతను సిటీలోకి వచ్చాడని చెప్పి వెతుకుతుంటారు. ఇక మరో పక్క దేవా కోసం వెతికే డేవిడ్ గ్యాంగ్ కూడా అతని కోసం వెతుకుతుంది. అయితే దేవ.. దాసుల మధ్య స్నేహం దేవాని మార్చేస్తుంది. అదెలా తన మీద పడిన ముద్ర చెరిపేసేందుకు దేవా ఏం చేశాడు అన్నది సినిమా కథ.
దేవాగా నాగార్జున అదరగొట్టారు. సినిమాకు ఆయన పాత్ర చాలా ప్రాధాన్యమని చెప్పొచ్చు. ఇక మరోపక్క నాని దాసు పాత్ర చాలా అమాయకంగా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. స్క్రీన్ మీద నాగ్, నానిల కాంబినేషన్ బాగుంది. ఇక హీరోయిన్స్ రష్మిక, ఆకాంక్ష సింగ్ ఇద్దరు బాగా చేశారు. నరేష్, మురళి శర్మ పాత్రలు అలరించాయి. వెన్నెల కిశోర్, వేణు ఉన్నా పెద్దగా కామెడీ పండలేదు.
శాందత్ సాయినుద్దీన్ సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. నాగార్జున లుక్స్ పరంగా అదరగొట్టాడు.. నాని కూడా బాగానే ఉన్నాడు. ఇక మణిశర్మ మ్యూజిక్ ఇంప్రెసివ్ గా ఉంది. రెండు సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఎంత బడ్జెట్ కావాలో అంత కేటాయించారు.