ఆ సూపర్ స్టార్ బాడీగార్డు జీతం.. ఏకంగా రూ. 2.5 కోట్లు..?
సినిమా సెలబ్రెటీలంటే ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే. అటు సినిమాలు.. ఇటు ఈవెంట్లు.. ఆ తర్వాత యాడ్లు.. ఇలా వీరి డైరీల్లో ఒక్క పేజీ కూడా ఖాళీగా ఉండదు. అందుకు తగ్గ ఆదాయం కూడా భారీగానే ఉంటుంది. ఇక బాలీవుడ్ హీరోలైతే.. ఏడాది ఆదాయం వందల కోట్లలోనే ఉంటుంది.
అయితే హీరోల ఆదాయం ఎంతగా ఉంటుందో.. వారి మెయింటైన్సు కూడా అదే రేంజ్ లో ఉంటుంది మరి. ప్రత్యేకించి వీరికి జనంలో ఉండే క్రేజ్ వల్ల కాలు బయటపెట్టడం అంత ఈజీ కాదు. ఫుల్ సెక్యూరిటీ ఉండాలి. బాగా నమ్మకమైన బాడీ గార్డు ఉండాలి. అందుకే సూపర్ స్టార్లబాడీగార్డులకు కూడా అదే రేంజ్లో జీతాలు ఉంటాయి.
ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్.. ఇండస్ట్రీలోనే అందరికంటే ఎక్కువగా తన బాడీ గార్డుకు జీతం ఇస్తున్నాడు. ఈ బాద్షా బాడీగార్డు పేరు రవి సింగ్.. ఈయన జీతం ఏకంగా రూ. 2.5 కోట్లు.. అంటే.. అంటే నెలకు లెక్కేసుకుంటే 20 లక్షల పై మాటే.. ఇక షారుఖ్ ఖాన్ ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాడంటే.. వెంట రవి సింగ్ ఉండాల్సిందే.
ఇక మిలిగిన హీరోల విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్ బాడీ గార్డు పేరు షెరా.. ఆయన జీతం ఏడాదికి 2 కోట్లు... ఆమిర్ ఖాన్ బాడీగార్డు యువ్‌రాజ్ ఘోర్పడె శాలరీ కూడా ఏడాదికి రెండు కోట్లు. ఆ తర్వాత బిగ్ బీ అమితాబ్ బాడీగార్డ్ జితేంద్ర షిండే జీతం ఏడాదికి రూ.1.5 కోట్లు. అక్షయ్ కుమార్ తన బాడీ గార్డుకు ఏటా రూ.1.2 కోట్లు ఇస్తున్నాడు. హీరోయిన్లలో అత్యధికంగా దీపికా పదుకొణె తన బాడీగార్డు జలాల్‌కు ఏడాదికి రూ.కోటి. ఇస్తోంది.