వకీల్ సాబ్ షూటింగ్.. పవన్ జాయినింగ్ కు డేట్ ఫిక్స్..!
వీటిలో వకీల్ సాబ్ ఉంది. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈమధ్యే షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. అయితే.. ఈ షెడ్యూల్లో పవన్ జాయిన్ కాలేదు. ఆయన లేని సన్నివేశాలు తెరకెక్కించారు. పవన్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ చూస్తున్నారు. ఇప్పుడు పవన్ టైమ్ వచ్చిందని ఫిలింనగర్ సర్కిల్స్ లో ఓ వార్త రౌండ్ అవుతోంది. నవంబర్ 1 నుంచి పవన్ కల్యాణ్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి. చతుర్మాస దీక్ష కూడా పూర్తి కావడంతో పవన్ షూటింగ్ షురూ చేసారని తెలుస్తోంది.
అయితే.. ప్రస్తుతానికి గాసిప్ గా ఉన్న ఈ వార్తపై అఫిషియల్ న్యూస్ రివీల్ కావాల్సి ఉంది. ఇదే నిజమైతే ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే పూర్తి కానుంది. సినిమాలో పవన్ హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. ఇతర ముఖ్య పాత్రల్లో నివేధా ధామస్, అంజలి నటిస్తున్నారు. పవన్ జాయిన్ అయ్యే షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.