ఆచార్యలో చిరంజీవి మార్క్ మ్యాజిక్..! కొరటాల ప్లాన్..
చిరంజీవి ఠాగూర్ కూడా సీరియస్ కంటెంట్ తోనే తెరకెక్కింది. అయితే.. ఆ సినిమాలో చిరంజీవికి హీరోయిన్, పాటలు, కొంత కామెడీ ఉంది. ప్రస్తుతం చేస్తున్న ‘ఆచార్య’ సినిమాకు దర్శకుడు కొరటాల శివ. ఇప్పటివరకూ కొరటాల దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కధా వస్తువులే. కామెడీకి ఏమాత్రం స్కోప్ లేని సినిమాలు. వాటితోనే సూపర్ హిట్స్ అందుకున్నాడు. మరి.. ఈసారి కొరటాలకు హీరో మెగాస్టార్ చిరంజీవి. పైగా కమర్షియల్ సినిమా. పాటలు, ఫైట్స్ తోపాటు కామెడీ ఉండాల్సిందే. అందుకే ‘ఆచార్య’లో ఈసారి కామెడీని మిస్ కాకూడదని ఫిక్స్ అయ్యాడట. కామెడీ టైమింగ్ లో చిరంజీవిది అందె వేసిన చేయి అనే విషయం తెలిసిందే.
చిరంజీవి సైరాలో కామెడీ లేదు.. కొరటాల గత సినిమాల్లో కామెడీ లేదు. అందుకే ‘ఆచార్య’లో ఇద్దరూ కలిసి ఈ విషయంలో తమ సత్తా చూపాలని ఫిక్స్ అయ్యారని అంటున్నారు. కరోనా వల్ల గ్యాప్ వచ్చిన ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానుందని తెలుస్తోంది. కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ 40 శాతం పూర్తైంది. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాతలు.