చెక్ పక్కా హిట్ డైరక్టర్ కు కాన్ఫిడెన్స్ ఇచ్చిన నితిన్..!

shami
నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో వస్తున్న సినిమా చెక్. ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. నితిన్ రెగ్యులర్ ఇమేజ్ కు భిన్నంగా కమర్షియల్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కించారు. ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు సినిమాలతో యూనిక్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న చంద్రశేఖర్ యేలేటి ఈ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.
ఆదివారం సాయంత్రం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రాజమౌళి, వరుణ్ తేజ్ వచ్చారు. సినిమా గురించి హీరో నితిన్ మాట్లాడుతూ సినిమా తనకు డైరక్టర్ చంద్రశేఖర్ యేలేటికి మంచి పేరు తెస్తుందని అన్నారు. అయితే సినిమా ఆయన ఇలా చెప్పగానే తనకు పేరు వద్దు కమర్షియల్ సక్సెస్ కావాలని అన్నారు. డెఫినెట్ గా ఈ సినిమా చంద్రశేఖర్ యేలేటి కెరియర్ లో బెస్ట్ కమర్షియల్ హిట్ అవుతుందని అన్నారు నితిన్. ఆయన చెప్పినట్టుగా సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి.
సినిమాను వారం రోజుల నుండే ప్రమోట్ చేస్తున్నా సినిమా టీజర్, ట్రైలర్ ఆసక్తి కలిగించాయి. మరి చంద్రశేఖర్ యేలేటి స్టైల్ ఆఫ్ టేకింగ్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులు గెలుస్తుందా లేదా అన్నది చూడాలంటే మరో ఐదురోజులు ఎదురుచూడాల్సిందే. ఈ సినిమాలో నితిన్ సరసన ప్రియా ప్రకాశ్ వారియర్, రకుల్ నటించారు. సినిమా మీద నితిన్ ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు భీష్మ తర్వాత నితిన్ నుండి వస్తున్న ఈ సినిమా ఎలాంటి అంచనాలను అందుకుంటుందో చూడాలి. సినిమా ప్రమోషన్స్ చూస్తుంటే సినిమా అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేలా ఉందనిపిస్తుంది.                       


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: