బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన తాప్సీ...?
ఇటీవల ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తాప్సి పన్ను మాట్లాడుతూ.అందరికి నా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండటంవలన పలు రకాల కధనాలు ప్రచారం లోకి తీసుకువస్తున్నారు,నేను ఇంకా వివాహం చేసుకోలేదు.నా జీవితంలోకి వస్తున్నా వ్యక్తి సినిమా రంగానికో క్రికెట్ రంగానికో సంబందించి వ్యక్తి కాదు .అసలు ఈ దగ్గరలో ఉన్న వ్యక్తి అయితే కానే కాదు అని తెలిపారు.నేను ప్రేమిస్తున్న వ్యక్తి బాడ్మింటన్ ఆటగాడైన మథియాస్ బోతో అని తాప్సి వెల్లడించారు.
నా తల్లితండ్రులు ఒప్పుకున్నారు కాబట్టే ఈ విషయాన్నీ బహిర్గతం చేస్తున్నాను.ఈ నేపథ్యంలో తాప్సి తన వివాహం గురించి మాట్లాడుతూ నేను ఎప్పుడైతే పిల్లలు కావాలి అని కోరుకుంటానో అప్పుడు మాత్రమే నేను వివాహం చేసుకుంటాను అని తెలిపారు.నేను బాగా హడావిడి చేసుకునేలా పెళ్లి చేసుకోను ..చాలా సాదాసీదాగా నా దగ్గర స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకుంటాను అని వెల్లడించారు.