తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై.. కుర్రకారుని తనదైన మాయలో పడేసిన సమంతా.. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. ఆ మధ్య కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సమంత.. ఆ ఖాలీ సమయంలో వెబ్ సిరీస్‌ల్లో నటించింది. అందులో భాగంగా సమంత అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానున్న ది ఫ్యామిలీ మ్యాన్ అనే పాపులర్ వెబ్ సిరీస్ రెండవ సీజన్‌లో కీలకపాత్రలో కనిపించనుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ త్వరలో స్ట్రీమ్ కానుందని అమోజాన్ ప్రకటించింది..
మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ యావత్ దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. రెండో సీజన్‌లో సమంత టెర్రరిస్ట్‌గా నటిస్తుండడంతో ఈ సిరీస్‌పై మరింత ఆసక్తి నెలకొంది.సమంత అక్కినేని ఓ బేబీ తర్వాత.. జాను అనే సినిమాలో నటించింది.ఆ సినిమా తర్వాత ఆమె చానాళ్ల వరకు సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఎప్పటికప్పుడు ఆమె తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. సమంత తన సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె షేర్ చేస్తూ..తన ఫాలోవర్స్‌ను అలరిస్తూ ఉంటోంది.
ఆమెకు ఇప్పటికే 15 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో సమంతను ఫాలో అయ్యేవారి సంఖ్య 16 మిలియన్స్‌కు చేరుకుంది. దీంతో ఈ ఈ విషయాన్ని సమంత తన ఇన్‌స్టా స్టోరీస్ ద్వారా తెలియజేస్తూ అభిమానులకు తన ఫాలోవర్స్ థాంక్స్ చెప్పింది.ఇక ప్రస్తుతం సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'శాకుంతలం' చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనుంది అక్కినేని కోడలు..ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఇక ఈ సినిమాని కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మించే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్..!!