ప్రియుడి కౌగిలించుకుని స్టార్ హీరో కూతురు రచ్చ.. రచ్చ.. ఆ స్టార్ హీరో ఎవరంటే..!
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ పెద్దగా సెలబ్రిటీ కాకపోయినా.. తండ్రి బ్యాక్ గ్రౌండ్ తో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఈ అమ్మాయి గత కొద్ది నెలల నుంచి తన జిమ్ కోచ్, ఫిట్నెస్ ట్రైనర్ నుపూర్ షిఖారేతో లవ్‌లో ఉన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అతడితో ప్రేమాయణంపై ఇరా కూడా బహిరంగంగానే ప్రకటన కూడా చేసింది. తాను, నూపుర్ లవ్‌లో ఉన్నామని, తమ రిలేషన్ చాలా గట్టిదని తన సోషల్ మీడియా ఖాతాల్లో తెగ పోస్టులు కూడా పెడుతూ ఉంటుంది.
తాజాగా తన బాయ్ ఫ్రెండ్ దగ్గర బాక్సింగ్ నేర్చుకుంటూ హగ్ లతో తెగ రెచ్చిపోయింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇటీవలే షేర్ చేసింది. అందులో తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి కాలితో కిక్ చేయడం ప్రాక్టీస్ చేయడం, అయితే ఎంత ప్రయత్నించినా కిక్ చేయలేకపోవడంతో అలసిపోయి అతడి చేతుల్లో వాలిపోయి గట్టిగా కౌగలించుకోవడం గమనించవచ్చు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.