ఈసారి ఆస్కార్ అందుకోబోయే నటులు వీరే....

Purushottham Vinay
సినిమా రంగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అవార్డులు అంటే ఆస్కార్ అవార్డ్స్ అనే చెప్పాలి. ప్రతి ఒక్క నటుడు తన జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ అందుకోవాలని కోరుకుంటాడు. ఒక నటుడికి ఆస్కార్ అవార్డు వస్తే చాలు తన జన్మ ధన్యం అనుకుంటాడు. అలాంటి ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి కరోనావైరస్ అడ్డంకిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్19 వైరస్ విజృంభించడంతో ప్రతిష్టాత్మకమైన అవార్డుల కార్యక్రమానికి గతేడాది కూడా ఇలాంటి ఇబ్బంది ఏర్పడింది. అయితే ప్రస్తుతం ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ అవార్డుల కార్యక్రమం ఎప్పుడు? ఎక్కడ వీక్షించవచ్చనే విషయంలోకి వెళితే..ఇక బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా, ఆమె భర్త ఇంటర్నేషన్ సింగర్ నిక్ జోనస్ ఆస్కార్ అవార్డు నామినేషన్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా వారు 23 కేటగిరిలో అవార్డులను ప్రకటించారు.దీంతో 93వ ఆస్కార్ అవార్డుల వేడుకలను భారతీయులు కూడా వీక్షించవచ్చట.అయితే ఆస్కార్ అవార్డుల వేడుకకు ముందు.. భారీగా ఊహగానాలు చెలరేగుతున్నాయి. ఉత్తమ చిత్రంగా నోమ్యాడ్‌లాండ్, ఉత్తమ దర్శకుడిగా క్లో జావ్, ఉత్తమ యానిమేటెడ్ చిత్రంగా సోల్, ఉత్తమ నటుడిగా చాడ్విక్ బోస్‌మెన్, ఉత్తమ నటిగా ఫ్రాన్సెస్ మెక్‌డర్మాండ్, ఉత్తమ వీఎఫ్ఎక్స్‌ చిత్రంగా టెనెట్ చిత్రానికి అవార్డుల దక్కుతాయని సినిమా ప్రియులు అంచనా వేస్తున్నారు.ఇక ఈ మహోన్నత కార్యక్రమం ఏప్రిల్ 25వ తేదీ అర్ధరాత్రి ప్రారంభం అవుతుంది. ఆస్కార్ అవార్డుల కార్యక్రమం స్టార్ వరల్డ్, స్టార్ మూవీస్‌లో సోమవారం ఉదయం 5.30 నుంచి భారత్‌లో ప్రసారం అవుతాయి. ఈ అవార్డుల వేడుకను ఆస్కార్.కామ్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.ఇక ఇండియా నుంచి గతంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ ఆస్కార్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. స్లమ్ డాగ్ మిలీనియర్ సినిమాకి గాను అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలాగే పాటలు అందించినందుకు గాను ఏ.ఆర్.రెహమాన్ ఆస్కార్ అవార్డు అందుకోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: