హీరోయిన్లలో ఈ బ్యూటీ రేంజే వేరు.. ఇప్పటికీ టాప్ లోనే!!
నయనతార అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సీత పాత్రతో భక్తి పండించినా.. స్విమ్ సూట్లో అందాలు ఆరబోసినా ఆమెకే సొంతం. నటనతో కూడా అదే రేంజ్లో మార్కులు కొట్టేస్తుంది. కోలీవుడ్‌లో అడుగుపెట్టినప్పటినుంచే మంచి అవకాశాలు దక్కించుకుంటూ.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీలో సైతం అదే ఊపు కొనసాగించింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో సీనియర్ స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం వెయిట్ చేశారంటే నయన డిమాండ్ ఏంటో అర్థమవుతుంది.
సినిమా ఇండస్ట్రీ పేరు, స్టేటస్, సక్సెస్ ఎంతలా ఇస్తుందో.. అందే వేగంగా వాటిని లాగేసుకోగలదు. వ్యక్తిగత జీవితాల్లో సంభవించే వివాదాలే దీనికి ప్రధారన కారణంగా నిలుస్తాయి. వారి కెరీర్‌కి ఫుల్ స్టాప్ పెట్టేస్తాయి. కానీ నయన విషయంలో అలా జరగలేదు. ఆమె అన్సక్సెస్ఫుల్ లవ్ స్టోరీస్ చాలానే ఉన్నా.. అవన్నీ బయటకు తెలిసినా ఆమె కెరీర్‌ను మాత్రం డ్యామేజ్ చేయలేకపోయాయి. ఇప్పటికీ ఆమె స్పీడ్‌కు బ్రేకులు వేయలేకపోతున్నాయి.
కాగా.. నయన ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దూసుకుపోతోంది. అయితే ప్రస్తుతం ఆమె దృష్టంతా కోలీవుడ్మీదే ఉంది. అక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే లేడీ ఓరియెంటెడ్ మూవీ నిఝల్తో ఈ ఏడాది మనముందుకు రావల్సి ఉంది. కానీ కరోనా కారణంగా నిలిచిపోయింది. ఇక దీని తర్వాత మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ నేత్రికన్, అలాగే సూపర్ స్టార్ రజనీతో అన్నాత్తే సినిమా, కాతువాకుల రెండు కథల్ అనే సినిమా చేస్తోంది.