వకీల్ సాబ్ సినిమాలో మెట్రో ఫైట్ సీన్ చూశారుగా.. అందులో పవన్ ఎలా ఫైట్ చేస్తాడు..? రౌడీలను చితక్కొట్టి ముగ్గురు అమ్మాయిలనూ కాపాడతాడు. ఒక్కక్కళ్లనీ కొట్టేటప్పుడు పవన్ స్టైల్, స్టామినా మామూలుగా ఉండవు. ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయిస్తాయి. అయితే అదే ఫైట్ సీన్ రీమేక్ చేస్తే...? అది కూడా ఎవరో హీరోలు, నటీనటులు కాదు.. స్కూల్ పిల్లలు. మీరు విన్నది నిజమే.. స్కూల్లో చదువుకునే ఓ 10 మంది పిల్లలు వకీల్ సాబ్ మెట్రో ట్రైన్ ఫైట్‌ని యాజ్ ఇట్ ఈజ్ దింపేశారు. ఆ స్టైల్, ఎఫెక్ట్స్ దించేశారు. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా అదరగొట్టాడు. బుడతలు బుడ్డోళ్లయినా.. బడా రేంజ్లో సీన్ క్రియేట్ చేశారు.
నెల్లూరులోని కొందరు స్కూల్ పిల్లలు వాళ్లు. అప్పుడప్పుడూ సినిమాల్లోని సీన్స్‌ను రీ క్రియేట్ చేస్తూ యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంటారు. వీరికి కొందరు యువకుల సాయం కూడా ఉంది. కెమెరామెన్, డైరెక్షన్ అంతా వాళ్లు చూసుకుంటారు. ఇప్పటికే మహర్షి, శ్రీమంతుడు వంటి సినిమాల్లోని కొన్ని ఫైట్లను వీరు క్రియేట్ చేసి మంచి పేరు సంపాదించారు. ఇక తాజాగా పవర్ స్టార్ వకీల్ సాబ్‌లోని మెట్రో ఫైట్ సీక్వెన్స్‌ని రీక్రియేట్ చేస్తూ ఓ వీడియో రూపొందించారు. బాత్రూమ్, ట్రైన్ యాక్షన్ సన్నివేశాలను సినిమాలో చూపించిన దానికి ఏమాత్రం తీసిపోకుండా పవర్‌ఫుల్‌గా చిత్రీకరించారు. ఈ వీడియోను గుంటూరు పవర్‌స్టార్ అభిమానులు ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ‘కుర్రాళ్లు ఇరగదీశారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మూడేళ్ల తర్వాత పవన్‌కల్యాణ్ ‘వకీల్ సాబ్’గా ఫ్యాన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. వారి ఆతృతకు తెరదించుతూ ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. పవర్‌స్టార్‌ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటారో దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్‌ను అలానే చూపించారు. సినిమాలో పవన్ డైలాగ్‌లకు, నేపథ్య సంగీతానికి, ఫైట్లకు థియేటర్లు ఈలలలు, చప్పట్లతో మోగిపోయిన విషయం తెలిసిందే.