మెగాస్టార్ మూవీకి 33 ఏళ్ళు..

Divya

మెగాస్టార్ చిరంజీవి అంటే సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది.ఆయన కరోనా వచ్చి ఆక్సిజన్ లేక ఇబ్బంది పడుతున్న వారికి తన వంతు సహాయంగా ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేశారు. అంతేకాకుండా తమ సినీ ఇండస్ట్రీలో అనారోగ్యంతో బాధపడుతున్న పావలా శ్యామల వంటి నటీమణులకు తన వంతు సహాయంగా డబ్బులు ఇచ్చారు. ఇదిలా ఉండగా చిరంజీవి నటించిన సినిమాలలో "ఖైదీ నెంబర్ 786" సినిమా దాదాపుగా రిలీజ్ అయ్యి 33 సంవత్సరాలు అవుతోంది. అయితే ఆ సినిమా విశేషాలు ఏంటో తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవికి "ఖైదీ " అనే పదం బాగా కలిసొచ్చింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1983లో ఖైదీ సినిమా తీయగా.. తన సినీ జీవితాన్నే  మార్చివేసింది ఈ సినిమా. ఇక ఆ తర్వాత 1988లో వచ్చిన ఖైదీ నెంబర్ 786. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇక కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత కం బ్యాక్ ఎంట్రీతో తీసిన ఖైదీ నెంబర్ 150 సినిమా కూడా కం బ్యాక్ సినిమాగా నిలిచింది.
దీంతో చిరంజీవికి ఖైదీ అనే టైటిల్ ఉండడంవల్ల బాగా కలిసి వస్తుందనే నమ్మకం కూడా ఏర్పడింది. ఈ సినిమా విడుదలయ్యి ఈ రోజుకి దాదాపుగా 33 ఏళ్లు అవుతుంది. ఈ సినిమాని తమిళ్ లో అమ్మన్ కోవిల్ కీలక్కాలే రీమేక్ గా ఖైదీ నెంబర్ 786 రూపొందించారు. ఈ సినిమాలో చిరంజీవికి  జోడిగా భానుప్రియ నటించింది. అంతేకాకుండా ఇందులో ఒక పాటలో  సిల్క్ స్మిత కనిపించడం మరో విశేషం.

ఈ సినిమాకి రాజ్ కోటి సంగీతాన్ని అందిచగా .. గువ్వా .. గోరింకతో, అటు అమలాపురం. వంటి పాటలు అప్పట్లో ప్రభంజనం సృష్టించాయి. ఈ రెండు పాటల విశేషమేమిటంటే , ఈ రెండు పాటలను మెగా ఫ్యామిలీ లో హీరోలు రీమేక్ చేశారు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా లో తన మేనల్లుడు గువ్వా గోరింకతో పాటను రీమేక్ చేయగా, ఇక అల్లు శిరీష్ నటించిన కొత్త జంట సినిమా లో అటు అమలాపురం అనే పాటకు స్టెప్పులు వేశారు.  ఏది ఏమైనప్పటికీ చిరంజీవికి ఖైదీ అనే టైటిల్ బాగా కలిసొచ్చింది అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: