మహేష్ బాబు సినిమాలో బావ గల్లా జయదేవ్ గెస్ట్ రోల్.. ఏ సినిమానో తెలుసా?
గల్లా జయదేవ్ అంటే రాజకీయంగా అందరికీ పరిచయమే. అలాగే మహేష్ బాబు కు స్వయానా బావ కావడంతో ఆయన సినిమా ప్రేక్షకులకు కూడా చాలామందికి పరిచయమే. మహేష్ సోదరి పద్మావతిని ఆయన 1991లో వివాహం చేసుకున్నారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా కొనసాగుతూనే ఆయన అమర రాజా బ్యాటరీస్ సంస్థను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అలాంటి ఆయన ఒక సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు అంటే నమ్మడం కష్టమే. కానీ ఇప్పుడు చెప్పేదంతా నిజమే. ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన నాని అనే సినిమాలో కొన్ని సెకన్ల పాటు కనిపించే అతిధి పాత్రలో కనిపించారు.
ఎస్.జె.సూర్య దర్శకత్వంలో మంజుల ఘట్టమనేని నిర్మించిన నాని సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించారు. ఈ సినిమాలో దేవయాని మహేష్ బాబు తల్లిగా నటించగా అమీషా పటేల్ హీరోయిన్ గా నటించారు.. ఒక పిల్లవాడికి ఇంజెక్షన్ ఇస్తే పెద్దవాడిగా ఎలా మారిపోతాడు అనే కధాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలోని గల్లా జయదేవ్ ఒక కాన్ఫరెన్స్ హాల్లో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒక ఉద్యోగిగా కనిపిస్తారు. కనిపించేది కొన్ని సెకన్లపాటు అయినా అప్పటికి ఆయన పెద్దగా జనానికి పరిచయం లేరు.