సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల కంటే మావీ ఆర్టిస్ట్ అసోసిసియేషన్ ఎన్నికల్లోనే ఎక్కువ పాలిటిక్స్ జరుగుతుంటాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో వివాదాలు చెలరేగడం..ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం..స్టేజ్ ల మీదనే దుమ్ము దులుపుకోవడం సాధారనమే. గత పదేళ్లుగా మా అసోసియేషన్ వల్ల జరిగిన అభివృద్ధి కంటే వివాదాలే ఎక్కువని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా తాజాగా మరోసారి మా ఎన్నికలకు వేళయ్యింది. నిజానికి మా ఎన్నికలు గతేడాదే జరగాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే తాజాగా కరోనా కేసులు తగ్గటంతో ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సిద్ధమవుతోంది.
ఇక కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నట్టుగానే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తాను మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ప్రకాశ్ రాజ్ కు పోటీగా జీవిత రంగంలోకి దిగుతారని అంతా భావించారు. కానీ అలా జరగకపోగా అనూహ్యంగా మెహన్ బాబు తనయుడు మంచు విష్ణు తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అంతే కాకుండా ఇప్పటికే మంచు విష్ణు మోహన్ బాబుతో కలిసి పావులు కదపటం కూడా మొదలు పెట్టారు. నాన్ని మోహన్ బాబుతో కలిసి టాలీవుడ్ లోని ప్రముఖుల వద్దకు మోహన్ బాబు వెళుతున్నారు.
ఇదిలా ఉండగా నటుడు ప్రకాశ్ రాజ్ కు కూడా భారీగానే మద్దతు ఉంది. చిరంజీవి, నాగబాబు ప్రకాష్ రాజ్ కు మద్దతు ప్రకటించారు. ఇక నాగబాబు అయితే ప్రకాశ్ రాజ్ మా అధ్యక్షుడు అయితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రకాశ్ రాజ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించారని మా అసోసియేషన్ బాధ్యతలు ఆయన సక్రమంగా నిర్వహించగలరని చెబుతున్నారు. మరోవైపు ప్రకాశ్ రాజ్ ను అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు వ్యతిరేఖత కూడా వస్తోంది. దానికి కారణం ప్రకాశ్ రాజ్ కర్నాటక వ్యక్తి అని లోకల్ కాదని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది.
అయితే గతంలో నడిగర్ సంఘంలో ఇలాంటి రచ్చనే జరిగింది. ఒక తెలుగు వాడికి నడిగర్ సంఘం పీఠాన్ని ఎలా అప్పగిస్తారని ఓ తమిళ వర్గం విశాల్ ను వ్యతిరేకించింది. అతడిని అడ్డుకునేందకు నానా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు అదే మా ఎన్నికలల్లో రిపీట్ అవుతుందా..? లేదంటే మెగాస్టార్ మ్యానేజ్ చేస్తారా.? అన్నది చూడాలి.