ఆ యాక్సిడెంట్‌తో రాజ్‌తరుణ్ డిస్టర్బ్ అయ్యాడా..?
అయితే రాజ్ తరుణ్ కి చేతినిండా సినిమాలు ఉన్నా సరైన సక్సెస్ లేకపోవడంతో ఆయన సినిమా జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటుండు. ఇక కొన్ని నెలల క్రితం రాజ్ తరుణ్ కి యాక్సిడెంట్ అయినా సంగతి అందరికి తెలిసిందే. తాజగా రాజ్ తరుణ్ ఆ యాక్సిడెంట్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక విషయాలను చెప్పారు. అయితే ఆ యాక్సిడెంట్ ఘటన వల్ల చాలా డిస్టర్బ్ అయ్యానని రాజ్ తరుణ్ తెలియజేశారు. ఇక ఆ ఘటన జరిగిన సమయంలో తనకు వైరల్ ఫీవర్ కూడా వచ్చిందని రాజ్ తరుణ్ తెలిపారు.
ఇక రాజ్ తరుణ్ రాజా రవీంద్రకు కాల్ చేసి తనకు ఎవరికీ సమాధానం చెప్పే ఆసక్తి లేదని తనకు ఏం చెప్పొద్దని చెప్పానని ఆయన అన్నారు. అంతేకాదు.. కార్తీక్ అనే వ్యక్తి తనకు అస్సలు పరిచయం లేదని ఆ వ్యక్తి చేసింది తప్పే అని అలా డబ్బులు డిమాండ్ చేశాడంటే తనకు ఏం అవసరాలు ఉన్నాయో అని రాజ్ తరుణ్ అన్నారు. అంతేకాదు.. ఆ ఘటన తర్వాత డ్రైవింగ్ మానేశానని రాజ్ తరుణ్ అన్నారు. ఇక ఆ ఘటన భయపెట్టిందని రాజ్ తరుణ్ మాటలు వింటే అర్ధం అవుతుంది.