సౌరవ్ గంగూలీ బయోపిక్ కి ఆ హీరోకి అంత సీన్ ఉందా

Mamatha Reddy
ఇటీవల కాలంలో బయోపిక్ సినిమాలు తెరకెక్కించడం రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.  క్రీడాకారుల బయోపిక్ దగ్గరనుంచి సినిమా హీరోల బయోపిక్ లు, సాధారణ వ్యక్తుల, అలాగే గొప్ప గొప్ప వారి బయోపిక్ లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు మేకర్స్. క్రీడాకారుల విషయానికి వస్తే ధోని, సచిన్ టెండూల్కర్, సైనానెహ్వాల్, గీతా పోగట్ దంగల్ వంటి చిత్రా లు క్రీడాకారులు సాధించి న గొప్ప గొప్ప రికార్డుల గురించి సినిమా లు గా తీ సి ప్రేక్షకుల ను ఎంతగానో మేప్పించారు. అంతేకాదు ఎంతోమందిలో స్ఫూర్తిని రగిలించేలా చేశారు.

ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కూడా కపిల్ దేవ్ బయోపిక్,  పుల్లెల గోపీచంద్ బయోపిక్ లతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు నిర్మాతలు.  అలాగే  టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ కూడా తెరకెక్కించాలన్న చర్చ గత కొన్ని రోజులుగా సాగుతుండగా ఈ విషయంపై సౌరవ్ స్పందించారు. మొత్తానికి తన బయోపిక్ నిర్మించడానికి అంగీకరించారు. భారీ బడ్జెట్ తో ఈ మాజీ కెప్టెన్ బయోపిక్ రూపొందుతుండగా బాలీవుడ్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ పాత్రను రణబీర్ కపూర్ పోషించే అవకాశం ఉందని సమాచారం. 

200 నుంచి 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది.  అయితే ఈ సినిమాను తాను అంగీకరించాను కానీ డైరెక్టర్ పేరు ఇప్పుడే చెప్పలేనని ఈ సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ చెప్పడానికి కొన్ని రోజుల సమయం ఉందని దాదాపు పేర్కొన్నారు. భారతీయ క్రికెట్ చరిత్రను పూర్తిగా మార్చివేసి ఇప్పుడు వరుస విజయాలు అందుకోవడంలో ఇండియన్ క్రికెట్ లో సమూల మార్పులు చేశారు గంగులీ. ఎడమ చేతి వాటం బ్యాట్స్ మెన్ గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సౌరవ్ రిటైర్మెంట్ తర్వాత బిసిసిఐ అధ్యక్షుడిగా కొనసాగుతూ భారతీయ క్రికెట్ ఆట కు విశేష సేవలు అందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: