కొండవీటి రాజా ఐటెం సాంగ్ వెనుక ఇంత కథ జరిగిందా..?
ఎందుకంటే మొదట ఐటమ్ సాంగ్ ను చిరంజీవి, సిల్క్ స్మిత తో మాత్రమే చేయాలి. ఇందుకోసం ఏకంగా ఐదు లక్షల రూపాయలను పెట్టి ఒక భారీ సెట్ ను వేయడం జరిగింది. ఇక ఆ కాలంలో సిల్క్ స్మిత రేంజ్ చాలా ఎక్కువగా ఉండేది. ఇక ఈ పాట కోసం ఆమెకు ఏకంగా 25 వేల రూపాయలను రెమ్యూనరేషన్ గా ఇచ్చి కొద్దినెలల కిందటే కాల్ షీట్లు కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాదు ఈ పాట ప్రత్యేకంగా ఉండాలి అని కాస్ట్యూమ్స్ కోసం ఆమెకు 20 వేల రూపాయలను కూడా అదనంగా ఇచ్చారట. కానీ ఆమె మాత్రం మొదటి రోజు షూటింగ్ మొదలవగానే , అలాగే చింపిరి జుట్టుతో సెట్లోకి అడుగుపెట్టింది.
రాఘవేంద్రరావుకు నచ్చకపోవడంతో మొదట హెయిర్ స్టైల్ ను మార్చమని, కాస్ట్యూమ్స్ కూడా సరిగ్గా వేసుకోమని చెప్పాడట. అయితే సిల్క్ స్మిత అందుకు ఒప్పుకోక, పైగా దర్శకుడితో వాదనకు దిగినట్టు సమాచారం. అయినా కూడా రాఘవేంద్రరావు పట్టించుకోకుండా , పాటలో కొంత భాగం పొగమంచులో షూటింగ్ తీయాలని అనుకున్నారు. అయితే ఆమెకు ఇష్టం లేదని , అందుకు పొగ వాతావరణాన్ని దూరం చేసేందుకు ఫ్యాన్ పెట్టింది. ఇక నిర్మాత దేవి వరప్రసాద్ కూడా స్మిత బిహేవియర్ గమనిస్తూనే వచ్చారు.
ఎలాగోల మొదటి రోజు పూర్తి చేసుకుంది. ఇక రెండవ రోజు కూడా స్మిత ప్రవర్తన అలాగే ఉంది. నటీనటులు దర్శకుడి దగ్గరికి వెళ్లి మాట్లాడాలి . కానీ ఇక్కడ మాత్రం స్మిత , దర్శకుడు తన దగ్గరికి వచ్చి మాట్లాడాలని ఆర్డర్ వేయడంతో కోపం తెచ్చుకొని నిర్మాత, వెంటనే ఆమెను అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పారట. అయితే అప్పటికే సగభాగం స్మితతో పూర్తవడంతో, రెండవ భాగంలో జయమాలిని , అనురాధ ని తీసుకొచ్చి ఈ పాటని చిత్రీకరించారు.