RC15 : కథలో కీలక మార్పులు చేస్తున్న శంకర్ ?
ప్రేక్షకులు కూడా ఈ సినిమా గురించి ఎన్నో కలలు కంటున్నారు. సెన్సేషనల్ కాంబో కావడం చేత, ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే స్టోరీ విషయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు madhav BURRA' target='_blank' title='సాయి మాధవ్ బుర్రా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సాయి మాధవ్ బుర్రా కథను మాటలు అందిస్తున్నాడు. దీనితో శంకర్ కథను ఈయనకు వివరించాడు. దీనితో ఆ కథ సాయి మాధవ్ వల్లనే లీక్ అయిందని విమర్శలు వస్తున్నాయి. లీక్ అయిన దానిని బట్టి ఈ కథ "ఒక ఐఏఎస్ అధికారి కొన్ని పరిస్థితుల కారణంగా సీఎం తో గొడవ పెట్టుకుని, సీఎం అవుతాడని తెలుస్తోంది". మాములుగా ఒక కథ విషయంలో సినిమా బృందం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో తెలిసిందే. అలాంటిది కథ లీక్ అవ్వడంతో డైరెక్టర్ శంకర్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఇక కథ తెలిసిపోతే ప్రేక్షకుడు థ్రిల్ ఫీల్ అయ్యే అవకాశమే లేదు.
అందుకే కథలో కీలక మార్పులు చేస్తున్నట్లుగా అంతర్గత సమాచారం. అందుకే సినిమా షూటింగ్ కూడా లేట్ అవుతోందని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు, కథ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడడు. మొత్తం కథ సిద్దమయ్యాకే షూటింగ్ మొదలెడతాడు. మరి ఈ విషయంలో నిర్మాతల పరిస్థితి ఏమిటో తెలియాల్సి ఉంది.