దర్శకుడి పేరుతో ఆఫర్... కానీ పడక గది కండిషన్ అప్లై

Vimalatha
సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఒక ఎత్తయితే సోషల్ మీడియాలో ప్రముఖుల పేర్లతో అమ్మాయిలకు, అమాయకులకు గాలం వేసే కేటుగాళ్ల బ్యాచ్ మరొకటి. సినీ సెలబ్రిటీల పేరుతో వారికి ఆఫర్ ఇస్తున్నా మంటూ చెప్పి మోసం చేస్తూ ఉంటారు. ఇక అందులో చిక్కుకున్నారు అంటే అంతే సంగతులు. తెలివిగా బయటపడగలిగితే బ్రతికి పోయినట్టు.
తాజాగా హీరోయిన్ కూడా ఇలాంటి ఆఫర్ ఒకటి వచ్చింది. అని ఆమె సమయస్ఫూర్తితో తెలివిగా పోలీసులను సంప్రదించి వేటగాళ్ల బారిన పడకుండా తప్పించుకుంది.
వివరాల్లోకి వెళితే... పాయల్ సర్కార్ బెంగాలీ సీరియల్స్‌లో అత్యంత బిజీగా ఉండే నటీమణులలో ఒకరు. ఆమెకు ప్రముఖ దర్శకుడు రవి కినాగి అనే ప్రొఫైల్ నుండి శనివారం ఉదయం ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందని, 'అన్నదాత', 'ఛాంపియన్, బొందన్', 'ఐ లవ్ యు', 'లవ్ స్టోరీ', 'వాంటెడ్ ఫేమస్' చిత్రాల దర్శకుడు రవి కినాగి పేరిట ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు రావడంతో ఆనందం పట్టలేకపోయానని ఆమె చెప్పుకొచ్చింది. కానీ  ఆ ఆనందం ఆవిరవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు.
ముందుగా సినిమా ఆఫర్ ను ఇచ్చిన ఆయన ఈ హీరోయిన్ తో పడకగది కండిషన్ అప్లై అన్నాడట. ఇదంతా మెసెంజర్ యాప్ లో చాట్ ద్వారా జరిగింది. దీంతో కంగుతిన్న ఆమె ఆ చాటింగ్ స్క్రీన్ షాట్లను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాకుండా కోల్ కొత్తా పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పస్తుతానికి ప్రొఫైల్ ను డిలీట్ చేసినప్పటికీ ఆ ఐపీ అడ్రస్ దొరికినట్టు సమాచారం.
రవి కినాగి ఈ విషయంపై స్పందిస్తూ ఆ ప్రొఫైల్ తనది కాదని, ఈ విషయంపై తాను కూడా సైబర్ సెల్ ను సంప్రదిస్తానని చెప్పుకొచ్చారు.  కాగా పాయల్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరపున పోటీ చేసి ఓడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: