ప్రియాంక చోప్రా పై భర్త ఫీలింగ్ మరి ఇలా బయటపెట్టాలా..!

Pulgam Srinivas
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన కంటే పది ఏళ్ళు చిన్నవాడైన సింగర్ నిక్ జోనాస్‌తో డేటింగ్ చేసి అతన్నే వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అప్పట్లో వీరి ప్రేమ వ్యవహారం జనాల్లో చర్చనీయాంశం అయింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న వీరిద్దరూ పబ్లిక్ రొమాన్స్ చేస్తూ నిత్యం జనాల నోళ్ళలో నానుతున్నారు. ప్రియాంక- నిక్ దంపతులు వీలైనప్పుడల్లా రొమాంటిక్ టూర్ లను ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ టూర్ లలో భాగంగా దిగిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు పబ్లిక్ గా రొమాన్స్ చేస్తున్న వీడియో లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీరు, సినిమా ఫంక్షన్లలో కూడా ఇలానే చేస్తుంటారు. చాలా సందర్భాలలో మోడ్రన్ దుస్తుల్లో కనిపించి ప్రియాంక చోప్రా జనాల మతి పోగొడుతుంది. ప్రియాంక సినిమా కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా తన భర్త నిక్ జోనాస్‌తో రొమాంటిక్ మూమెంట్స్ ఎంజాయ్ చేయడంలో మాత్రం ఎప్పుడూ ముందుంటూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది. ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో తన ప్రైవేట్ పార్ట్‌ను భర్త స్నాక్స్‌లా కొరుక్కుతింటున్నాడు అన్నట్లుగా ఆమె చేసిన కామెంట్ వైరల్‌గా మారింది.

 ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రియాంక- నిక్ దంపతులు ఎక్కడ ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, అనేది ఆలోచించకుండా వారు చేసే ఎంజాయ్ ను వారు చేస్తూ ఉంటారు. మరియు ఆ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు .ఈ మధ్యకాలంలో ప్రియాంక గర్భం దాల్చిందనే వార్తలు కూడా తెగ వైరల్ అయ్యాయి.మరోవైపు 'అన్ ఫినిష్డ్' పేరుతో రిలీజ్ చేసిన బుక్‌లో ఆమె చెప్పిన విశేషాలు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ప్రియాంక చోప్రా ఏదో ఒక విషయం ద్వారా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: