పవన్ కళ్యాణ్ ఆస్తి విలువ అక్షరాల అన్ని కోట్లా..?
సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత 2019 సంవత్సరం నాటికి ఆయన బ్యాంకు బ్యాలెన్స్ మొత్తం ఐదు కోట్ల 20 లక్షలు. ఇక మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఒక రూ.1,50,00,000.. ఇక ఈయన ఇల్లు ,పొలాలు, స్థలాలు, లగ్జరీ కార్లు ,బైకులు, బంగారం మొత్తం అన్ని కలుపుకొని రూ.18 కోట్ల 75 లక్షలు. ఇక ఎలక్షన్స్ టైంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు.. అఫిడవిట్లో ఆయన పేర్కొన్న మొత్తం ఆస్తి విలువలు 52 కోట్ల 76 లక్షల రూపాయలు. ఈ మొత్తంలో పవన్ కళ్యాణ్ 25 కోట్ల రూపాయలను బ్యాంకులకు రుణాలుగా కట్టాల్సి ఉందట.
ఇక ఆయన దగ్గర కేవలం 25 కోట్ల రూపాయలు మాత్రమే మిగిలి ఉంటుంది.. నిజం చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ ఎవరైనా సహాయం అడిగితే, కష్టాల్లో ఉన్నారని తెలిస్తే , తప్పకుండా వారికి డబ్బు సహాయం చేస్తారు. అంతేకాదు ప్రమాదాలు , విపత్తులు సంభవించినప్పుడు తప్పకుండా ఆర్థిక సహాయాన్ని చేస్తాడు పవన్ కళ్యాణ్. ఇక ఆయన ఎంత సంపాదించినా అది ప్రజల కోసమే కేటాయిస్తాను అని చెప్పడం ఆయన మంచితనం.. ఆయన ఆస్తి అంటారా.. ఆయన అభిమానులు.. వారు చూపించే ప్రేమ విలువలు..
పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ ను ఒక దేవుడిలా భావిస్తారు.. ఇక ఇంతకుమించిన గొప్ప ఆస్తి ఎవరికి ఉండదనే చెప్పాలి.. అందరూ బాగుండాలి.. అందులో నేను కూడా ఉండాలి అనే సిద్ధాంతాన్ని పవన్ కళ్యాణ్ నమ్ముతారు.