స్టార్ హీరోలు ఈమె డేట్స్ కోసం ఎదురు చూసేవారు..
ఇటీవల కాలంలో ముంబై లేదా ఇతర దేశాల నుంచి ఐటమ్ గర్ల్స్ ను తీసుకుంటున్నారే..తప్ప, ఆ కాలంలో అందరికీ అన్ని సినిమాలలో ఐటెం సాంగులలో మెప్పించేది మన జ్యోతి లక్ష్మినే. ఈమె వేసేది వ్యాంప్ పాత్రలే అయినప్పటికీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఈమె కోసమే ప్రేక్షకులు సినిమాలు చూడడానికి వెళ్లేవారు. ఒకసారి జ్యోతిలక్ష్మి కి చీర కట్టి విజయ చిత్రం పత్రిక లో ఆమె ఫోటోను అచ్చు వేయిస్తే, ఆ పత్రిక అధిపతి విజయ సంస్థ అధినేత నాగిరెడ్డి జ్యోతి లక్ష్మి కి చీర కడితే ఎవరు చూస్తారయ్యా..! అంటూ అన్నారాయన.. అంటే ఆమె కేవలం ఐటమ్ సాంగ్ లకే కాదు ఆహార్యం లో కూడా ఆమెకు అభిమానులు ఉన్నారు.. అందులో ఎలాంటి సందేహం లేదు.
ఈమె కృష్ణ ,ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి పలువురు స్టార్ హీరోల సినిమాలలో ఐటమ్ గర్ల్ గా మెరిసింది. జ్యోతిలక్ష్మి మేనత్త ఎస్ పీ ఎల్ ధనలక్ష్మి అప్పట్లోనే మంచి గుర్తింపు పొందిన నటి. ఈమె జ్యోతిలక్ష్మి ని దత్తత తీసుకొని అన్ని విధాల ,అన్ని రకాల ఆమెకు శిక్షణ ఇచ్చి ఆ తరువాత సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది.