కొన్ని పాటలు సినిమాలకు హైప్ ను క్రియేట్ చేస్తాయి. ఆ పాట కోసమైనా సినిమాకు వెళ్లాలని ప్రేక్షకులు అనుకుంటారు. ఈ మధ్య కాలంలో అలా సినిమాకు హైప్ క్రియేట్ చేసిన పాట సారంగదరియా...ఈ పాట ఇప్పటికే తెలంగాణ జానపద ప్రియులకు సుపరిచితమైనప్పటికీ సుద్దాల అశోక్ తేజ పాట లిరిక్స్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి సినిమాకు అందించారు. ఇక ఈ పాటను సింగర్ మంగ్లీ తన గాత్రంతో మరో లెవల్ కు తీసుకుపోయింది. సారంగదరియా లిరికల్ వీడియోకే ఎంతో క్రేజ్ రాగా ఆ తరవాత సాయి పల్లవి వేసిన స్టెప్పులతో సారంగదరియాను వదిలారు. ఇక ఆవీడియోకు యూట్యూబ్ ఏకంగా మిలియన్ల కొద్దీ వ్యూవ్స్ వచ్చాయి.
అంతే కాకుండా ఈ పాటతో రౌడీ బేబీ సాయి పల్లవి తన గత పాటల రికార్డులను తానే బద్దలు కొట్టింది. ఇటీవల లవ్ స్టోరీ ఆడియో ఫంక్షన్ జరగ్గా చిరంజీవి సైతం గెస్ట్ గా హాజరయ్యారు. అంతే కాకుండా చిరంజీవి ఈ సినిమాలోని సారంగదరియా పాట కోసమైనా సినిమాను రెండు సార్లు చూస్తానంటూ చెప్పారంటే సారంగదరియా క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక పాటకు వచ్చిన క్రేజ్ తో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంగ్లీ సారంగదరియాను పాడగా రౌడీ బేబీ సాయి పల్లవి వెళ్లి పాటకు స్టెప్పులు వేసింది.
దాంతో ఈవెంట్ లో మళ్లీ సారంగదరియాకు రౌడీ బేబీ వేసిన స్టెప్పులే హైలెట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా నేడు విడుదల కాగా సారంగదరియా పాట గురించి మాత్రం చాలా తక్కువగా వినిపిస్తోంది. అయితే సినిమా విడుదలైన తరవాత ఈ పాటను వెనక్కి నెట్టి ఏయ్ పిల్లా పాట ముందుకు వచ్చింది. సినిమా చూసిన వాళ్లంతా సినిమాలో ఏయ్ పిల్లా పాటనే సూపర్ గా ఉందని చెబుతున్నారు. సినిమా మొత్తానికి ఎన్ని విజిల్స్ పడ్డాయో ఒక్క ఏయ్ పిల్లా పాటకే అన్ని విజిల్స్ పడ్డాయని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పాటకు అందిచిన మ్యూజిక్ తో పాటు వర్షంలో నాగ చైతన్య మరియు సాయి పల్లవి వేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.