పూజ హెగ్డే కి వారిద్దరూ మహా ఇష్టమట?
అదే విధంగా పూజా హెగ్డే కి కూడా కొన్ని ఇష్టమైన విషయాలు ఉన్నాయి. ఈ ముంబై భామకి హీరోలలో మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అట. ఓ ఇంటర్వ్యూ లో ఈమె విషయాన్ని తెలియచేసింది. అలాగే ప్రొడ్యూసర్ లలో టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ అంటే కూడా చాలా ఇష్టమని ఓ స్టేజ్ పై చెప్పారు పూజ. అంతేకాదు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా షూటింగ్ కి వెళ్తున్న సమయంలో సడెన్ గా నిర్మాత అల్లు అరవింద్ నుండి మెసేజ్ రావడం తో షాక్ అయిందట పూజ. అందులో ఏముందంటే, సినిమాలో ఎంతో బాగా నటించావు అంటూ తన అభిమాన నిర్మాత తనకి మెసేజ్ చేయడం తో చాలా సంతోషించారట పూజ.
ఇదంతా తాజాగా జరిగిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో చెప్పుకొచ్చారు పూజ. ఇక ఈమె తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇది కాకుండా రాధేశ్యామ్ మూవీలో కూడా పూజ హెగ్డే నటిచింది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.