అఖిల్ లవ్ స్టోరీ లనే ఎందుకు ఎంచుకుంటున్నాడు?
అయితే హీరో అక్కినేని అఖిల్ తన సినిమా లో ప్రేమ కథ నే ఉండాలని జగ్రత్త పడుతున్నాడు. ఆ ప్రేమ కథ లతో వస్తున్న సినిమా లే అఖిల్ ను హీరోగా మారుస్తున్నాయి. 2017 లో విక్రమ్ కుమార్ దర్వకత్వంలో వచ్చిన హాలో సినిమా కూడా వంద శాతం ప్రేమ కథ తోనే తీశారు. అయితే ఈ సినిమా అఖిల్ గత చిత్రాల కంటే కాస్త హిట్ ను అందుకుంది. దీని తర్వాత మిస్టర్ మజ్ను సినిమా అంత గా ఆడలేక పోయిన పర్వలేదని అనిపించింది. అలాగే అక్కినేని అఖిల్ మొదటి సినిమా అయిన అఖిల్ పూర్తి గా యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చింది. ఈ సినిమా కు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించినా.. ఈ సినిమా నిరాశ పరిచింది. ఈ సినిమా తర్వాత నుంచే అఖిల్ తీసే ప్రతి సినిమాలో కాస్త భిన్న మైన ప్రేమ కథ ను ఉండాలని చూస్తున్నాడు. అయితే అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే స్పై త్రిలర్ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఎలా ఆడుతుందో చూడాలి మరి.