నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ చిత్రం డిసెంబర్ లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ ఈ సినిమా తప్పకుండా డిసెంబర్లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. డిసెంబర్ నెలలో కాకపోతే వేసవి లోనే రిలీజ్ అయ్యేలా కనిపిస్తుంది. ఇక డిసెంబర్ లో అల్లు అర్జున్ నాని వంటి క్రేజీ హీరోల సినిమాలు ఉండగా వాటికి పోటీగా బాలకృష్ణ తన చిత్రాన్ని విడుదల చేయడం విశేషం. బోయపాటి శ్రీను తో కలిసి బాలకృష్ణ చేస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన రెండు సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
అయితే ఏపీలో టికెట్ రేట్ల సమస్య ఇంకా సద్దుమణిగక పోవడం అలాగే సినీ పెద్దల మీటింగ్ లు ఏ మాత్రం కూడా సత్ఫలితాన్ని ఇవ్వకపోవడం వల్ల అఖండ సినిమా పై ఎఫెక్ట్ బాగానే పడబోతుంది. బాలకృష్ణ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కు లాభాలు రావాలంటే తప్పకుండా తెలంగాణలో మాదిరిగా ఏపీలో కూడా టికెట్ల రేట్లు ఉండాలి. అలా కాకుండా చాలా తక్కువ ధరలో అక్కడ టికెట్ ధర నెలకొనడంతో ఇలానే ముందుకు సాగితే మాత్రం కలెక్షన్ల విషయంలో ఈ సినిమాపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది.
ఏదేమైనా సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న నాలుగు పెద్ద సినిమాలు అలాగే డిసెంబర్ లో విడుదల అవుతున్న మూడు పెద్ద సినిమాలు ఇప్పుడు నవంబర్ లో కూడా విడుదలవుతున్న కొన్ని సినిమాల రేట్ల విషయంలో కాంప్రమైజ్ అవుతూనే విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా వారిని ఈ భారీ కష్టం నుంచి బయట పడేసే వాళ్ళు ఎవరో చూడాలి. ఇక బాలకృష్ణ ఈ సినిమా తర్వాత మాస్ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని తో కలిసి ఓ భారీ యాక్షన్ చిత్రం చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా ఆయన వరుస స్టార్ దర్శకులతో సినిమా లు చేయనున్నాడు.