కేజీఎఫ్ సినిమాతో కైకాల కి ఉన్న సంబంధం ఏంటి ?

NIKHIL VINAY
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఇండియన్ బాక్స్ ఆఫీస్  దగ్గర రికార్డ్స్ క్రియేట్ చేసిన చిత్రం కే జి ఎఫ్.  ఈ సినిమా కన్నడ తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషలో కూడా విడుదలై భారీ విజయాన్ని సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు కే జి ఎఫ్ పార్ట్ 2 కోసం అన్ని భాషల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


 కే జి ఎఫ్ విడుదలైనప్పుడు ముందుగా కైకాల సత్యనారాయణ సమర్పించు అని పడుతుంది.  ఈ వార్త సినిమాకు తెలుగు సీనియర్ నటుడు అయిన కైకాల  సత్యనారాయణకు మధ్య సంబంధం ఏమిటని అప్పట్లో చాలామంది ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. దాదాపు 7 వందలకు పైగా సినిమాలు చేసిన కైకాల సత్యనారాయణ గారు చాలా సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.అయితే ఆయన పేరు సినిమాలో రావడానికి కారణం ఒకటి ఉంది. అదేంటి అంటే కైకాల సత్యనారాయణ గారు రమా ఫిల్మ్స్ బ్యానర్ పై సినిమాలు తీసేవారు.

ఈయన తనయుడు కన్నడలో  నిర్మాణ రంగంలో  ఉన్నాడు. అందులో భాగంగానే అక్కడ తను కేజిఎఫ్ సహ నిర్మాతగా ఉన్నారు. ఆ పరిస్థితులలో కేజిఎఫ్ విజయాన్ని ముందుగా ఊహించిన తన తనయుడు తెలుగులో ఈ చిత్రం రేటింగ్స్ కోసం పోటీ పడ్డాడు. కైకాల తనయుడు మరియు  సాయి కొర్రపాటి కలసి ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అందుకే ఈ చిత్రం విడుదలైనప్పుడు ముందుగా కైకాల సత్యనారాయణ సత్యనారాయణ సమర్పించు అని పడుతుంది. ఈ సినిమా ఘన విజయం సాధించిన తర్వాత ఈ చిత్ర యూనిట్ కైకాల సత్యనారాయణ కు సన్మానం కూడా చేశారు.ఇక కేజీఎఫ్ 2 సినిమా కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఘనంగా విడుదల కాబోతున్న సంగతి అందరికి తెలిసిందే. సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా మీద ఇండియా అంత భారీ అంచనాలే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: