మళ్లీ జూనియర్ కు కథ రెఢీ చేసిన జక్కన్న...?
ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు తో ఒక సినిమాను చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ఒక కథ కూడా రెడీగా పెట్టుకున్నారు అని ఎప్పుడో రెడీ చేసుకున్న కథను అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కే అవకాశం ఉందని ఆ సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్యను కూడా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మహేష్ బాబుతో చేసే సినిమాను వేగంగా పూర్తి చేసిన తర్వాత ఈ సినిమాను తెరకెక్కించి అవకాశం ఉందన్నమాట వినపడుతోంది.
ఈ సినిమాలో విలన్ గా సూర్య కనబడే అవకాశం ఉందని కొంతమంది అంటే అది కూడా మల్టీస్టారర్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేయడానికి సూర్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపధ్యంలో ఈ సినిమాను ముందుకు నడిపిస్తారని అంటున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి తో సినిమా అనగానే మరో ఆలోచన లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే సంగతి తెలిసిందే. కాబట్టి ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుంది ఏంటి అనేది తెలియాలంటే కొంత కాలం ఆగాలి. 2026 లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.