వీళ్లిద్దరి మధ్య ఉన్న సిమిలారిటీస్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!
యాక్టర్ శ్రీహరి..ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాలో హీరోగా, లీడ్ రోల్స్, విలన్ గా చేసిన శ్రీహరి కి టాలీవుడ్ లో మంచి పేరు ఉంది. ముఖ్యంగా ఆయన చెప్పే డైలాగ్స్ కి అందరు అట్రాక్ట్ అవుతారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న శ్రీహరి ఆరోగ్య కారణాల చేత మరణించారు. ఇక ఈయన భార్య మనకు బాగా సుపరిచితురాలే. డిస్కో శాంతి. ఈమె డ్యాన్స్ స్టెప్స్ కి ఎవ్వరైన క్లాప్స్ కొట్టాల్సిందే. స్టార్ హీరోలతో సమానంగా పోటీపడి డ్యాన్స్ వేయడంలో ఈమె తరువాతే ఎవ్వరైనా. ఇక శ్రీహరి..డిస్కో శాంతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇకపోతే జే డీ చక్రవర్తి..ఈయన కూడా శ్రీహరి లాగే అనుకృతి అనే ఐటెం సాంగ్స్ చేసే అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అంతేకాదు జేడీ కూడా శ్రీహరి లాగే ఫస్ట్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసుకుంటూ..ఆ తరువాత మెల్లగా హీరోగా, సినిమాలో లీడ్ రోల్ క్యారెక్టర్స్ చేసారు. ప్రస్తుతం జేడీ చక్రవర్తి హ్యాపీగా మ్యారిడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.