బన్నీ పై ' మెగా ' మంటలు...!
దర్శకుడు బోయపాటి శ్రీను గురించి ప్రస్తావన తీసుకు వచ్చిన బన్నీ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ హిట్ లు ఉన్నాయని.. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో సింహా - లెజెండ్ సినిమాలు వచ్చాయి... ఇప్పుడు ఈ రెండు సినిమాల ను మించి అఖండ మరింత బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు అఖండ జ్యోతిలా వెలుగుతూనే ఉంటుంది అని అని చెప్పారు.
గతంలో లో రుద్రమదేవి సినిమా ఫంక్షన్ లో మెగా అభిమానులు జై పవర్ స్టార్ అనమంటే బన్నీ చెప్పను బ్రదర్ అంటూ వెటకారంగా మాట్లాడి పవన్ ఫ్యాన్స్ కోపానికి గురయ్యాడు. అయితే ఇప్పుడు బాలయ్య ఫంక్షన్ కు వెళ్లడంతో పాటు బాలయ్య ను ఆకాశానికి ఎత్తేయడంతో నిన్నటి నుంచి మెగా గ్రూపులలో బన్నీ కు వ్యతిరేకంగా డిస్కషన్ లు నడుస్తున్నాయి.
బన్నీ కెరీర్ ఎదుగుదలకు కచ్చితంగా మెగా కాంపౌండ్ ఎంతో ఉపయోగపడింది. అయితే ఇప్పుడు ఆ మెగా కాంపౌండ్ పూర్తిగా మర్చిపోయి ఏకపక్షం గా వెళుతున్నాడని మెగా అభిమానులు మండిపడుతున్నారు. ఏదేమైనా బన్నీ పై మెగా ఫ్యాన్స్ అయితే గుర్రుగా ఉన్నారు అన్నది నిజం.