హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన కమల్ హాసన్.. నిజమేనా..ఫోటో వైరల్..!!
విశ్వనట కమలహాసన్ గత కొద్ది రోజుల కిందట కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన హాస్పిటల్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు అంటూ ఒక ఫోటో బాగా వైరల్ అవుతోంది.. నిజానికి కరోనా నుంచి కమలహాసన్ కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారా..? అతను ఇంటికి వచ్చినట్లు వస్తున్న వార్తలు ఎంతవరకు నిజం.. తాజాగా ఆయన ఇంటికి చేరుకున్నట్లు ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తూ ఉండడంతో ఇందులో నిజమెంత అంటూ అభిమానులు ఆరా తీయడం గమనార్హం..
గత నాలుగు రోజుల క్రితం ఆయన ఖాదీ బ్రాండ్ హౌస్ ఆఫ్ ఖద్దర్ లాంచ్ కోసం అమెరికా వెళ్లి వచ్చిన తర్వాత పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరారు. ఇక ప్రస్తుతం ఆయన చెన్నైలో శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని పార్టీ ప్రతినిధి తెలిపారు.