మహేష్ యాక్షన్ సీన్స్ సితార కు అయిష్టం !

Seetha Sailaja
మహేష్ కూతురు సితార కు సోషల్ మీడియాలో చాలామంది ఫాలోయర్స్ ఉన్నారు. ప్రతిరోజు రాత్రి తాను పడుకునే ముందు తన తండ్రి మహేష్ బాబు పాటలు విని మరీ పడుకునే సితార కు మహేష్ సినిమాలలో ఒక నచ్చని విషయం ఉందట. ఈమధ్య ఒక ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ ఈ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.

మహేష్ తాను నటించిన సినిమాలను విడుదలకు ఒక్కరోజు ముందు తన ఇంటిలోని హోమ్ ధియేటర్ లో తన భార్య పిల్లలతో కలిసి చూడటం ఒక అలవాటు. తాను నటించిన సినిమాకు మరుసటి రోజు ఎలాంటి టాక్ వస్తుందో అని భయపడే మహేష్ కు ఆ టాక్ రివ్యూల టార్చర్ కంటే తన మూవీల పై సితార చేసే కామెంట్స్ టార్చర్ ఎక్కువ అంటూ జోక్ చేసాడు.  

అంతేకాదు తాను సినిమాలలో చాల కష్టపడి చేసే యాక్షన్ సన్నివేశాలు ఏమాత్రం సితారకు నచ్చవని అలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు సితార ఆ యాక్షన్ సన్నివేశాలు చూడకుండా తన సెల్ లోని గేమ్స్ లోకి వెళ్ళిపోతుందని నవ్వుతూ చెప్పాడు. అయితే తాను హీరోయిన్ తో చేసే రొమాంటిక్ సీన్స్ మటుకు సితార ఎంజాయ్ చేస్తుందని అయితే అలాంటి సీన్స్ తన కొడుకు గౌతమ్ కు నచ్చవని తన పిల్లల మనస్తత్వాన్ని బయటపెట్టాడు.

నిజానికి సితారను తాను బాగా చదివించి దేశం గర్వించే ఒక సైంటిస్ట్ గా చేయాలి అనుకుంటే తనకు మాత్రం సినిమాలు అంటే ఇష్టం అని చెపుతూ భవిష్యత్తులో హీరోయిన్ గా మారుతుందేమో అంటూ జోక్ చేసాడు. టాప్ హీరోలు యాక్షన్ సన్నివేశాలు ఎంత ఎక్కువగా ఉంటే అంతగా భారీ కలక్షన్స్ వస్తున్న పరిస్థితులలో టాప్ హీరోలు అంతా ఒళ్ళుహూనం చేసుకుని యాక్షన్ సన్నివేశాలలో నటిస్తున్నారు. అయితే అలాంటి సన్నివేశాలు హీరోల పిల్లలకే ఇష్టం లేకపోవడంతో మహేష్ లాంటి టాప్ హీరోల పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నార్థకం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: