రామ్ చరణ్ కు ఆ కొరియోగ్రాఫర్ పై అంత నమ్మకమా...
అదేనండి మెగా కోడలు ఉపాసన ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలయిన విషయం తెలిసిందే. ఉపాసన సోదరి అనుష పాల వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. కాగ అనూష సంగీత్ వేడుకల బాధ్యతను అనీ మాస్టర్ చేతిలో పెట్టగా ఆమె సంతోషంతో పొంగిపోతున్నారు. ఈ ఈవెంట్ కు సంబందించి తన టీం తో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మెగా అభిమానులకు మంచి ట్రీట్ ఇస్తున్నారు. మరదలి పెళ్లి వేడుకలను దగ్గరుండి చూసుకుంటున్నారు రామ్ చరణ్. తాజాగా చెర్రీతో దిగిన ఫోటో ను షేర్ చేశారు అనీ మాస్టర్.
ఈ ఫోటోను షేర్ చేస్తూ నాపై 15 ఏళ్లుగా నమ్మకం ఉంచుతూ వస్తున్నందుకు నిజంగా కృతజ్ఞురాలిని అంటూ పోస్ట్ చేశారు అనీ మాస్టర్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో రామ్ చరణ్ సోదరి పెళ్లి సంగీత్ కు సంబందించిన పార్టీకి కూడా అనీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా చేసిన విషయం తెలిసిందే. కాగా ఇంకో విషయం కూడా వైరల్ గా మారుతోంది. రామ్ చరణ్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమాలో ఒక పాటకు వర్క్ చేసే అవకాశం కూడా రామ్ చరణ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ అనీ మాస్టర్ కు బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత మంచి అవకాశాలు వస్తున్నాయని అభిమానులు పొంగిపోతున్నారు.