భీమ్లా నాయక్ ను బలవంత పెడుతున్నారా
ఈ పాటలు బాక్సాఫీసు ను బద్దలు కొట్టే విధంగా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంది. సినిమాపై హైప్ పెంచే విధంగా గా ఈ పాటలు ఉన్నాయని చెప్పొచ్చు. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా పవన్ నటిస్తుండగా తమన్ అందించిన సంగీతం మరింత ప్లస్ అయ్యింది ఈ సినిమాకు. ఇక ఈ సినిమా విడుదల సమయంలోనే మరిన్ని తెలుగు లో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఆయా సినిమాల నిర్మాతలు ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసుకునే విధంగా ప్రణాళికలు రచిస్తుడడం అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు.
చాలా మంది సంక్రాంతి రేసు నుంచి ఈ సినిమా తప్పుకునే అవకాశం ఉన్నట్లుగా ఊహా కథనాలు చెప్పారు. ఈరోజు ఉదయం కూడా దీనికి సంబంధించిన వార్తలు బయటకు రాగా చిత్ర నిర్మాతల మధ్య చర్చలు జరిగిన తర్వాత ఈ సినిమా వాయిదా వేసుకోబోతుందని వార్తలు గట్టిగా వచ్చాయి. నిర్మాతలు కూడా వాయిదా కే ఆసక్తి చూపించినట్లు గా కథనాలు వచ్చాయి. అయితే ఈ రష్ చూసి ఈ సినిమా విడుదల పై క్లారిటీ ఇచ్చారు నిర్మాత లు. తప్పకుండా ఈ చిత్రం జనవరి 12 వ తేదీన విడుదల అవ్వడం ఖాయమని పేర్కొన్నారు. థియేటర్లలో ఈ చిత్రం బ్లాస్ట్ అయ్యే విధంగా హిట్ అవుతుందని కూడా వారు చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ చిత్రం హై ఓల్టేజ్ లో నటించిన ఈ చిత్రం ఏ రేంజ్ లో సూపర్ హిట్ అవుతుందో చూడాలి