అప్పుడే ఏం వద్దంటున్న స్టార్ హీరోయిన్...?
కీర్తి సురేష్ రెండు మూడు సినిమాల్లో తెలుగులో నటిస్తుండగా తమిళంలో ఒక సినిమాలో మలయాళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది. అయితే కీర్తి సురేష్ విషయంలో కొంతమంది దర్శకులు కాస్త వేగంగా అడుగులు వేస్తూ ఆమెను కొన్ని పాత్రలకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే ఒక కీలక పాత్ర కోసం ఆమెను అడిగి ఆ పాత్ర కాస్త బోల్డ్ గా ఉంటుందని అందులో నటించాలని కోరగా ఆమె మాత్రం అసలు ఆసక్తి లేదని చెప్పారని అంటున్నారు.
తనకు స్కిన్ షో చేయడం కాస్త ఇబ్బందికరంగా నే ఉన్నా సరే కొన్ని ప్రస్తుత పరిస్థితులకు తగిన విధంగా తాను నడుచుకుంటానని అంతేగాని నన్ను దయచేసి ఇబ్బంది పెట్టొద్దని తన రెమ్యూనరేషన్ కంటే కూడా కొన్ని కొన్ని చాలా ముఖ్యమని కాబట్టి అటువంటి పాత్రలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయలేను అని చెప్పారని అంటున్నారు. మరి భవిష్యత్తులో కీర్తి సురేష్ తెలుగు సినిమాతో పాటుగా తమిళ సినిమాల్లో ఎటువంటి పాత్రలు చేయబోతుంది ఆమె మార్క్ ఏ విధంగా ఉండబోతుందనేది చూడాలి.