మరో వ్యాపారం మొదలు పెడుతున్న మహేష్...?

Sahithya
మన తెలుగులో హీరోలు వ్యాపారాలు మీద ఎక్కువగా దృష్టి పెట్టడం అలాగే సినిమా లతో పాటుగా కొన్ని కొన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టడం అనేది కాస్త ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పాలి. ముఖ్యంగా మహేష్ బాబు ఈ మధ్యకాలంలో వ్యాపార రంగం మీద ఎక్కువగా దృష్టి పెట్టడం భార్యకు ఎక్కువగా బాధ్యతలు అప్పగించడం తన సినిమాలు చేస్తూనే తన సినిమాల్లో పెట్టుబడి పెట్టడం అనేది కాస్త ఆసక్తిని కలిగిస్తోంది. మహేష్ బాబు గతంలో కాస్త ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలి అంతే ఒకటికి పదిసార్లు ఆలోచించే వారు కానీ ఇప్పుడు మాత్రం అటువంటి పరిస్థితి లేదు అనేది ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
మహేష్ బాబు ఇప్పుడు ఒక ఆన్లైన్ స్టోర్ ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నారని త్వరలోనే దీనికి సంబంధించి ఒక ముందడుగు పడే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. ఆన్లైన్ స్టోర్ ఎందుకు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా చిన్నారుల కోసం ఈ ఆన్లైన్ స్టోర్ ని మహేష్ బాబు మొదలు పెట్టే అవకాశాలు ఉండవచ్చు అని దీనికి సంబంధించిన మరింత ఎక్కువగా దృష్టి పెడుతున్నారు అని అలాగే కుమార్తెతో కలిసి కొన్ని ప్రచార కార్యక్రమాలు కూడా చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఇక మహేష్ బాబు ఇప్పటికే మాల్స్ మీద కూడా దృష్టి పెట్టి అందులో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం కావడం పట్ల కూడా ఆసక్తి పెరుగుతోంది.చిన్న చిన్న సినిమాలను నిర్మించడానికి మహేష్ బాబు సిద్ధం కావడం అలాగే భార్య నమ్రతకు కొన్ని బాధ్యతలు అప్పగించటం అన్నీ కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు తన సినిమాల్లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా కొంత మంది హీరోలను ముందుకు నడిపించడానికి వారి వారి సినిమాల్లో కూడా కాస్తో కూస్తో పెట్టుబడి పెట్టి ప్రోత్సహించే ప్రయత్నాలు చేస్తుండగా ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: