వారెవ్వా : పొరుగు కోటలో పుష్ప‌రాజ్ ! అదిరింద‌హే!

Divya
ఈనెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా బన్నీ నటించిన పుష్ప సినిమాకు సంబంధించి మొదటి భాగం విడుదలకు సిద్ధమైంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంపై ఉన్న జీవోను హైకోర్టు కొట్టి వేసింది. దీంతో ఇక పాత సినిమా రేట్లకే వాటిని అమ్ముకోవచ్చు. ఇక ఈ సినిమా కోసమే అల్లు అర్జున్ చెన్నైకు వెళ్లి అక్కడ తన మాట్లాడే మాటలకు కు అభిమానులు క్రేజ్ను మామూలుగా చూపించలేదు. ఇక అక్కడి నుండి అభిమానులు కూడా పుష్ప అంటే పేరు కాదు.. ఫైర్.. ద రైజ్ అంటూ బాగా సందడి చేస్తున్నారు.
ఇక అల్లుఅర్జున్ అక్కడికి రావడంతో ఒక్కసారిగా తమిళనాడు లో ఉండే అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాగా సందడి చేశారు. ఇక అల్లు అర్జున్ మీడియా ముందు మాట్లాడుతూ పుష్ప సినిమా మేకప్ కోసమే చాలా కష్టపడ్డామని తెలియజేశారు. ఇక ఫాహద్ ఫజిల్.. నటన ఈ సినిమాకే హైలెట్ గా ఉంటుందని తెలిపారు. ఇక మలయాళ భాషలో నటించినప్పటికీ ఫాహద్ ఫజిల్ ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచారు అని తెలియజేశారు. మేమందరం ఎక్కువగా ఢీ గ్లామరస్లోనే కనిపించాము. ఇక ఈ సినిమా హిందీలో కూడా చేయడం చాలా ఆనందంగా ఉంది అని తెలియజేశారు.

అంటే ఆనందం తమిళనాడులో కూడా ఉందని వెల్లడించారు బన్నీ. తన జన్మించింది మద్రాసులో అని.. నేను కూడా తమిళ వాసిని అని బన్నీ కామెంట్లు చేయడం జరిగింది. దాదాపుగా 20 సంవత్సరాల వయస్సు వరకు నేను ఇక్కడే ఉన్నాను అని తెలియజేశారు. తమిళ భాషలో నేను చాలా స్పష్టంగా మాట్లాడతానని.. చెప్పి మాట్లాడడంతో అక్కడున్న ప్రేక్షకులను, ప్రముఖులను ఆశ్చర్య పరిచేలా చేశారు. ఇక ఈ సినిమా తనం పెరిగిన తమిళనాడులో బాగా ఆడాలని కోరుకుంటున్నాను అని తెలియజేశారు.
తాజాగా ఇప్పుడు మొదటిసారి ఒక తెలుగు యాక్టర్ కటౌట్ ను తమిళనాడులో ప్లేస్ చేయడం సంచలనంగా మారింది. నిజం చెప్పాలంటే అల్లు అర్జున్ క్రేజ్ తెలుగు రాష్ట్రాలను దాటి తమిళనాడుకు కూడా చేరుకుందని చెప్పవచ్చు. కోయంబత్తూర్ లో ఉన్న శాంతి థియేటర్లో పెద్ద ఎత్తున అల్లు అర్జున్ కటౌట్ ని ఏర్పాటు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు అక్కడి అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: