శ్రీ‌విష్ణు : అర్జున ఫల్గుణ సెన్సార్ పూర్తి.. విడుద‌ల ఎప్పుడంటే..?

N ANJANEYULU
కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తుంది మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్  నుండి శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన అర్జున ఫల్గుణ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుద‌ల‌వ్వ‌నుంది. ఇప్ప‌టికే సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ముఖ్యంగా నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ సంస్థ అద్భుత‌మైన చిత్రాన్నందించేందుకు సిద్ధ‌మైన‌ది.
ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర టీజ‌ర్‌,  పోస్ట‌ర్‌, ట్రైల‌ర్‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. డిసెంబ‌ర్ 31న విడుద‌లవ్వ‌నుండ‌డంతో మూవీ యూనిట్ ప్ర‌మోష‌న్స్‌లో వేగాన్ని పెంచింది. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ స్వరపరిచిన పాటలు కూడా ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఎన్ ఎం  పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తుండ‌గా.. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ నిర్వహిస్తున్నారు. పి. సుధీర్ వర్మ మాటలు అందించ‌గా.. పి. జగదీష్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసారు.
ఇటీవ‌ల తేజ మీడియాతో ముచ్చ‌టించిన సంద‌ర్భంలో తొలుత ఈ సినిమాకుఆర్జోజ్ అనే టైటిల్ పెట్టాల‌నుకున్నాం కానీ.. ఈస్ట్ గోదావ‌రిలో దొరికె కూల్ డ్రింక్ ఆర్టోజ్ కు వాళ్లు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో.. అర్జున ఫ‌ల్గున పెట్టాల్సి వ‌చ్చింద‌ని.. వ‌ర్షం వ‌చ్చిన‌ప్పుడు, ఉరుములు, మెరుపులు వ‌చ్చిన‌ప్పుడు అలా అంటే ధైర్యం వ‌స్తుంద‌ని గుర్తు చేసారు తేజ‌.
డిప‌రెంట్ క‌థ‌ల‌తో వ‌చ్చిన శ్రీ‌విష్ణు  ఇప్ప‌టికే టాలీవుడ్‌తో  హిట్లు సంపాదిస్తూ ఉన్నారు.  శ్రీ‌విష్ణు సినిమా వ‌స్తుందంటే మినిమం గ్యారెంటీ అని ప్రేక్ష‌కులనుకుంటారు.  తాజాగా ఆయ‌న న‌టించిన సినిమా అర్జున ఫ‌ల్గుణ ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుండ‌టంతో.. ట్రైల‌ర్ లోని ప‌లు స‌న్నివేశాలు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటాయి. ఈ సినిమాల‌తో ఎన్టీఆర్  ఎన్టీఆర్ అభిమానిగా శ్రీ‌విష్ణు క‌నిపించ‌నున్నారు.   ఈ ట్రైల‌ర్ లోని  ఒక  స‌న్నివేశం  శ్రీ‌విష్ణుకు త‌ల‌నొప్పిని తెచ్చి పెట్టింది. సినిమాలో హీరోయిన్ ను ఏమి చేస్తున్నారు అని అడ‌గ‌గా.. హీరోయిన్ గ్రామ వాలెంట‌రీగా ప‌ని చేస్తున్నాను అని స‌మాధానం చెబుతుంది.   ఇంటింటికీ వెళ్లి కోటా స‌రుకులిస్తారు అదేనా.? అని వెట‌కారంగా అడుగుతారు. ఇప్పుడు ఈ డైలాగ్  చ‌ర్చ‌కు దారి తీసిన‌ది. మ‌రోవైపు గ్రామ‌వాలెంట‌ర్ ఉద్యోగం గురించి చీప్‌గా మాట్లాడార‌ని శ్రీ‌విష్ణు ను ట్రోలింగ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: