కన్ఫ్యూజన్ లో అనిల్ రావిపూడి!!
పటాస్ సినిమా తో ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకునీ ఒక్కసారిగా టాప్ హీరోల అందరి దృష్టిని ఆకర్షించాడు. దాంతో అనిల్ రావిపూడి తో సినిమాలు చేయాలని చాలామంది హీరోలు ఎగబడ్డారు అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఆయన తన తదుపరి చిత్రాన్ని రవితేజతో చేయగా అది కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఒక్కసారిగా ఆయన స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. దాంతో మహేష్ బాబు ఆయనకు అవకాశం ఇవ్వగా ఆ అవకాశాన్ని నిలుపుకొని ఆ చిత్రాన్ని కూడా సూపర్ హిట్ చేసుకున్నాడు అనిల్ రావిపూడి.
ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం ఈఎఫ్3 చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా తొందర్లోనే ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో తన తదుపరి సినిమా గురించి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయన తన తదుపరి చిత్రాన్ని బాలకృష్ణతో చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తో కూడా ఆయన తన తదుపరి చిత్రం చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిలో ఎవరి తో ముందుకు వెళ్లాలని కన్ఫ్యూజన్ లో అనిల్ రావిపూడి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇద్దరు కూడా ఇండస్ట్రీలో టాప్ హీరోలు కాగా ఈ ఇద్దరి లో ఏ హీరో తో ఆయన ముందుకు వెళ్తారు చూడాలి.