తెగించేసిన షన్నూ..బ్రేకప్ తరువాత ఫస్ట్ టైం అలా..?
కెరీర్ పీక్స్ లో ఉండగానే నాలుగు రుపాయలు వెనక వేసుకుందాం అనుకున్నాడు ఏమో తెలియదు కానీ బిగ్ బాస్ ఆఫర్ రాగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సరే వెళ్ళాడు..హౌస్ లోకి వెళ్లిన వాడు తన గేం తను ఆడుకోకుండా పక్క అమ్మాయి ని కంట్రోల్ చేయడం ఏంటి..? అడిగితే ఫ్రెండ్ అంటాడు. మరి హౌస్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరు అలా లేరుగా. ఎవడి గేం వాడు ఆడుకుని వచ్చిన డబ్బులు తీసుకుని జంప్ అయ్యారు. మధ్యలో బొక్క పడింది షన్నుకే గా ..అటు కెరీర్ లో ఎప్పుడు లేని అన్నీ నెగిటీవ్ కామెంట్స్..మరో వైపు ఇష్టంగా ప్రేమించి ఐదేళ్లు ప్రతి కష్టంలోను తోడు ఉన్న అమ్మాయి..నువ్వు నాకు వద్దు అంటూ దూరమై బ్రేకప్ చెప్పేలా చేసుకున్నాడు. దీంతో వీళ్ల ప్రేమ - బ్రేకప్ వ్యవహారాలు నెట్టింట వైరల్ గా మారాయి.
అయితే దీప్తీ తో బ్రేకప్ తరువాత షన్ను సోషల్ మీడియాలో పెద్దగా కనిపించనప్పటికి.. ఫ్రెండ్స్ తో మాత్రం డైరెక్ట్ గా మాట్లాడుతున్నారట. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట ప్రత్యేక్షమైయాయి. ఇక ఈ ఫోటోలో చూసిన కొందరు నెటిజన్స్ ఐదేళ్ల లవ్ బ్రేకప్ అయితే ఇంత కూడా బాధ లేదా నీకు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొందరు దీప్తీ పోతే సిరి ఉందిగా అందుకే కూల్ గా ఉన్నాడు బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైన షన్ను కెరీర్ మళ్లీ పుంజుకోవాలంటే కొంచెం కష్టమే..!!