ఆ హాట్ బ్యూటీని సచ్చిపోమ్మంటున్న నెటిజన్స్..

Purushottham Vinay
ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇక ఈ విషయాన్ని వారు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులను వెల్లడిస్తున్నారు. సాధారణంగా అయితే వాళ్లు త్వరగా కోలుకోవాలంటూ తమ అభిమానులు ఇంకా నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటారు కానీ ఓ హాట్ హీరోయిన్ ను మాత్రం త్వరగా చచ్చిపో అంటూ నెటిజన్స్ చాలా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.ఇంతకీ ఆ హాట్ హీరోయిన్ ఎవరంటే..ఆమె ఎవరో కాదు బాలీవుడ్ లో తన హాట్ నెస్ తో రెచ్చిపోయి ఎంతకైనా తెగించే నటి స్వరా భాస్కర్. ఇప్పటివరకు కూడా స్వరా భాస్కర్ ను చాలా సార్లు నెటిజన్లుతెగ ట్రోల్ చేశారు. ఇక స్వలింగ సంపర్కానికి మద్దతుగా మాట్లాడి అప్పట్లో కొన్ని షాకింగ్ కామెంట్స్ కూడా చేసింది ఈ హాట్ బ్యూటీ స్వరా.

ఇక ఆ తర్వాత బాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ మరణం సమయంలో.. అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి మద్దతుగా మాట్లాడి మరోసారి నెటిజన్స్ కి ఫుల్ స్టఫ్ గా మారింది. మొదటినుంచి కూడా నెటిజన్లు స్వరాని టార్గెట్ చేస్తూ తెగ ట్రోల్ చేస్తుంటారు. రీసెంట్ గా తనకు కరోనా వచ్చిందని స్వరా సోషల్ మీడియా వేదికగా చెబితే.. 'అడ్వాన్స్ రెస్ట్ ఇన్ పీస్' అని నెటిజన్లు చాలా కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో 'త్వరగా చచ్చిపో.. నీకు నరకంలో కూడా ప్లేస్ ఉండదు' అని దారుణంగా పోస్ట్ లు పెడుతుండగా..'నువ్వు కరోనాతో సచ్చిపోతే చాలా మేలు, భూమికి పట్టిన పీడ అనేది విరగడవుతుందంటూ' అంటూ మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది చూసిన స్వరా భాస్కర్ ఆ పోస్ట్ లన్నీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. ఇలాంటి వారందరికీ తాను తిండి పెడుతున్నానని ఇంకా కేవలం తనని ట్రోలింగ్ చేస్తూ ఇలాంటి వారంతా పొట్టపోసుకుంటున్నారని కామెంట్ చేసింది. తనకు ఏమైనా జరిగిందంటే మీ జీవనాధారాన్ని కోల్పోతారని.. సో బ్రతకాలని కోరుకోండి అంటూ స్వరా సెటైర్లు వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: