ఓటీటీ : ఈ వారం సినీ ప్ర‌భంజ‌న‌మే!

Divya
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ప్రతి ఒక్కరూ ఓటీటీ లో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపుతున్నారు.. ఈ నేపథ్యంలోనే కొన్ని సినిమాలు ఇప్పటికే థియేటర్లలో విడుదలయ్యి.. ప్రేక్షకులను ఆకట్టుకోగా ఇప్పుడు నేరుగా ఓ టీ టీ లలో ప్రత్యక్షమయ్యాయి. అమెజాన్ , నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహా , వూట్ వంటి అన్ని ఓటీటీలలో కొత్త సినిమాలు ప్రసారం అవుతూ ఉండడం గమనార్హం..ఇకపోతే ఈవారం ఓటీటీలలో ప్రసారమవుతున్న సినిమాల గురించి తెలుసుకుందాం.

1. పుష్ప:
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 17 ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. థియేటర్లలో ఇప్పటికి కొన్ని కోట్ల రూపాయల షేర్ ను రాబడుతున్న  ఈ సినిమా తాజాగా జనవరి 7 2022న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఇకపోతే ఓటీటీ లో ప్రసారం అవుతున్న ఈ సినిమాను చూసి సెలబ్రిటీలు సైతం పాజిటివ్  కామెంట్లు చేస్తున్నారు.
2. జైల్:
వసంత బాల దర్శకత్వంలో జీవీ ప్రకాష్ కుమార్ నటించిన చిత్రం జైల్. డిసెంబర్ 9 2020 న ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. ఇక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా విడుదలైన ఈ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అవుతోంది.

3. హంబుల్ పొలిటీషియన్:
కన్నడ వెబ్ సిరీస్ ఎపిసోడ్.. ఈ వెబ్ సిరీస్ తాజా రాజకీయాలపై సాగే పొలిటికల్ మూవీ గా తెరకెక్కింది. ఇందులో మొత్తం పది ఎపిసోడ్లు ఉండగా ప్రస్తుతం వూట్ లో ప్రసారం కాబోతోంది.
4. అన్బరివు:
తమిళ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా జనవరి 7 2022 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలో ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోనుంది.
టెండర్ బార్ అమెజాన్ ప్రైమ్, వెల్లే అమెజాన్ ప్రైమ్ , చండీగడ్ కరే ఆషికి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: