అందాల ముద్దుగుమ్మ అమలా పాల్ తమిళ సినిమా అయిన మైనా తో మంచి క్రేజ్ ను దక్కించుకుంది. తమిళంలో మంచి విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో ప్రేమ ఖైదీ పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. ప్రేమ ఖైదీ పేరుతో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా అమలా పాల్ కు కూడా టాలీవుడ్ లో మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఇలా ప్రేమ ఖైదీ సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అమలా పాల్ ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది.
ఆ తర్వాత కూడా అనేక సినిమాల్లో నటించిన అమలా పాల్ ప్రస్తుతం మాత్రం సినిమాల పరంగా టాలీవుడ్ లో కొంత స్లో అయిందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అమలా పాల్ సినిమాల ద్వారా మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ ద్వారా కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఇప్పటికే తెలుగు ప్రముఖ ఓటిటి ఆహ లో కుడి ఎడమైతే అనే వెబ్ సిరీస్ లో అమలా పాల్ నటించింది. ఇది ఇలా ఉంటే అమలా పాల్ మరో వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. గత కొన్నేళ్లు హీరోయిన్స్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా.. వెబ్ సిరీస్ లతో పాటు టాక్ షో లతో కూడా అదరగొడుతున్నారు. తాజాగా అమలాపాల్ Ranjish Hi Sahi’ అనే వెబ్ సిరీస్ చేసింది. మహేష్ భట్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ‘Voot’ ఓటిటి ఫ్లాట్‌ఫామ్‌లో ఈ నెల 13 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ లో అమలా పాల్ ‘రాక్ స్టార్’ తరహా పాత్ర పోషించనున్నట్టు ఫస్ట్ లుక్ చూస్తుంటే తెలుస్తోంది.